చాలామంది ప్రజలు వారు తీసుకునే ఆహార పదార్థాల కారణంగా అధిక శరీరక బరువు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.అలాంటివారు ప్రస్తుతం మారిన కాలం ప్రకారం ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిది.
దానివల్ల వారి శరీరంలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే చాలామంది అధిక బరువుతో బాధపడుతూ శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఎన్నో కఠినమైన వ్యాయామాలను చేస్తూ ఉన్నారు.
అంతేకాకుండా అలాంటివారు సరైన ఆహార నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది.అయితే మరికొంతమంది ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్న శరీర బరువు మాత్రం పెరగకుండా ఉంటారు.
ఈ విధంగా చాలామంది బక్క పల్చగా ఉంటారు.ఈ ఆహార పదార్థాలను పెరుగుతో పాటు కలిపి తీసుకోవడం వల్ల కచ్చితంగా బరువు పెరిగే అవకాశం ఉంది.మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటే శరీర బరువు పెరుగుతారని విషయం చాలామందికి తెలిసిందే.అయితే కార్బోహైడ్రేట్లతో పాటు పిండి పదార్థాలు కూడా తీసుకోవడం వల్ల కచ్చితంగా బరువు పెరుగుతారు.
ఈ విధంగా అధిక మొత్తంలో పిండి పదార్థాలు కలిగి ఉన్న బంగాళదుంపలో పిండి పదార్థాలతో పాటు విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే ప్రతి రోజూ ఒక మధ్యరకం బంగాళదుంపను ఆహార పదార్థాలలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి క్యాలరీలతో పాటు పిండి పదార్థాలు ప్రోటీన్లు ఎక్కువగా అందుతాయి.బంగాళాదుంపతో పాటు పెరుగు కూడా తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది.అయితే శరీర బరువు పెరగాలనుకునేవారు ఉడికించిన బంగాళాదుంపను కొద్దిగా పెరుగు, పంచదారలో కలిపి అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల శరీర బరువు త్వరగా పెరిగే అవకాశం ఉంది.
అంతే కాకుండా శరీరానికి అధికంగా క్యాలరీలు లభించడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు.