మూమూలుగాని సీనియర్ హీరోలు అప్పట్లో పెద్దగా డ్యాన్సులు వేసేవారు కాదు.ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణం రాజు లాంటి మరి పూర్.
అక్కినేని కొంత బెటర్ అయన డ్యాన్స్ లో కొంచం ఈజ్ ఉండేది.ఇక కృష్ణ కి అయితే డ్రిల్ మాస్టర్ పని లాగ ఎక్సరసైజ్ చేసినట్టు గా ఉండేది డ్యాన్స్ అంటే.
అప్పట్లో హీరోలు అలాగే ఉండేవారు.అయితే కృష్ణ గారితో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అయన ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చిన చదివేసి గుర్తుపెట్టుకో గలరు.
పేజీలకు పేజీలు అయన కంఠతా పట్టేయగలరు.కానీ డ్యాన్స్ అంటే మాత్రం చాల కష్టం.
మరి అలాంటి కృష్ణ ఏకంగా పేరిణి నృత్యం చేయిస్తే ఎలా ఉంటుంది చెప్పండి.ఈ మాట చెప్పగానే కృష్ణ గారు కూడా నవ్వేశారట.
అయినా కూడా కృష్ణ గారు దేనికి వెనక్కి పోయే మనిషి కాదు.తనను చూసి మెచ్చుకుంటే మెచ్చుకుంటారు లేదంటే లేదు.ఏకలవ్య సినిమా కోసం దర్శకుడు విజయ రెడ్డి అడగ్గానే అయన మొదట నవ్వినా మరు క్షణం ఒకే చేద్దాం అన్నారట.అయన స్పాంటేనియస్ కి దర్శకుడు సైతం అవాక్కయాడట.
ఇక మాములు డ్యాన్స్ అంటే సరే హీరోయిన్ చుట్టూ ఎదో తిరుగుతూ మానేజ్ చేయచ్చు కానీ పేరిణి నాట్యం లో మరొక వ్యక్తి ఉండడు.అన్ని తానై నడపాలి.
అందుకే ఇలా శాస్త్రీయ నృత్యం కోసం డ్యాన్స్ మాస్టర్ శ్రీను రాజు ని తెప్పించాడు డైరెక్టర్.మూడు రోజుల పాటు కొన్ని భంగిమలు నేర్పించాడు మాస్టర్.
అయన నేర్చుకోవడం లో దిట్ట కాబట్టి త్వరాగానే పట్టేసాడు.

పేరిణి నృత్యం కోసం నేర్చుకున్న స్టెప్పులు ఆ తర్వాత డ్యాన్స్ కొంత మెరుగు పరుచుకోవడానికి బాగా ఉపయోగ పడింది.ఇక ఈ నాట్యం కోసం మోగింది డమరుకం- మేల్కొంది హిమనగరం పాట కూడా సిద్ధం అయ్యింది.సినిమా చూసాక కొందరు పెదవి విరిస్తే కొందరు అబ్బో కృష్ణ గారు గట్టి సాహసమే చేసారు అనుకున్నారు.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయన చేయాల్సిన పని చేసేసాడు.నవ్వే వాళ్ళు నవ్వినా అయన ఎవరి కోసం ఏ పని ఆపలేదు.ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చిన మళ్లి కొత్త సినిమాలు తీయడం ఆగలేదు.ఎంత మంది వెనక తిట్టిన రెండో పెళ్లి ఆగలేదు.
రెండో భార్య ఏం అనుకున్న మొదటి భార్య తో కాపురం ఆగలేదు.అందరికి అన్ని ఇచ్చాడు.







