మెటా యాజమాన్యంలోని WhatsApp ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌లో కమ్యూనిటీ ఫీచర్‌ను విడుదల చేసింది.వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ ద్వారా పోల్స్ చేయవచ్చు.
ఒక ట్యాప్ వీడియో కాలింగ్ కాకుండా, 32 మంది వ్యక్తులు వీడియో కాలింగ్‌లో ఏకకాలంలో ఒక గ్రూప్‌లో చేరవచ్చు.ఈ ఫీచర్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు అన్ని గ్రూపులను ఒకే కమ్యూనిటీలోకి ఉంచవచ్చు.
ఎప్పుడైతే ఈ కమ్యూనిటీస్‌ని వాట్సాప్ తీసుకొచ్చిందో దీనిపై ప్రజల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయి.ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు తెలియక చాలా మంది తికమకపడుతున్నారు.
వారి సందేహాలను నివృత్తి చేస్తూ వాటిని మధ్య వ్యత్యాసాలను, వాటి వల్ల ప్రయోజనాలను వాట్సాప్ వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

గ్రూప్స్‌ను వాట్సాప్ బాగా అభివృద్ధి చేసింది.ఇందులో ఇప్పుడు గరిష్టంగా 1024 మందిని సభ్యులుగా చేర్పించుకోవచ్చు.ఇందులో చేసే సంభాషణలు అత్యంత భద్రతను కలిగి ఉంటాయి.పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కలిగి ఉంటాయి.అడ్మిన్ అనుమతితో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కానీ, ఇన్వైట్ లింక్ పంపించి కానీ గ్రూపులో ఇతరులను సభ్యులుగా చేర్చుకునే సౌలభ్యం ఉంది.ఇక కమ్యూనిటీస్ విషయానికి వస్తే ప్రస్తుతం మనకు చాలా గ్రూపులు ఉంటాయి.
కొన్ని స్కూలుకు, ఆఫీసుకు సంబంధించినవి.మరికొన్ని వ్యక్తిగతానికి సంబంధించినవి ఉంటాయి.
ఒకే రకానికి సంబంధించిన గ్రూపులన్నింటినీ ఒక కమ్యూనిటీలోకి తీసుకు రావొచ్చు.అంటే కమ్యూనిటీలోకి గరిష్టంగా 20 గ్రూపులను చేర్చవచ్చు.
ఫలితంగా ఒక గ్రూపులో వచ్చిన సమాచారాన్ని అదే తరహా ఇతర గ్రూపుల్లో వేయాలంటే కమ్యూనిటీ ద్వారా సులభం అవుతుంది.







