అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు , 01 ట్రాక్టర్ స్వాధీనం.
వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి.రాజన్న సిరిసిల్ల జిల్లా :నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం బుధవారం ఉదయం రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేవురిపాలెం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డిఎస్పీ అన్నారు.ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచారి మట్లాడుతు ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.పట్టణ, గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామాలుగా చేయలనే జిల్లా ఎస్పీ ఉద్దేశ్యం తోనే ఈ యొక్క కార్యక్రమo నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలల చే విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగిందని, యువత మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గంజాయి కి సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ వారికి అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని, సరైన నంబర్ ప్లేట్స్ లేని 30 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్ సీజ్ చేయడం జరిగిందని సబంధించిన వాహన దారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకవేళ్ళవచ్చు అన్నారు.
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు.గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.
గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో,నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ అశోక్, శ్రీకాంత్ ,పోలీస్ సిబ్బంది , డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు
.