హ్యాపీ డేస్( Happy Days ) సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు వరుణ్ సందేశ్( Varun Sandesh ) .ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.
అనంతరం కొత్త బంగారులోకం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నారు.ఇలా వరుస హిట్ సినిమాలు పడటంతో ఈయనకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటమే కాకుండా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
అయితే ఈయన నటించిన తదుపరి సినిమాలో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.దీంతో క్రమక్రమంగా సినిమాలకు కూడా వరుణ్ సందేశ్ దూరమయ్యారు.

ఇక హీరోయిన్ వితికా( Vithika ) తో కలిసి నటించిన ఈయన అనంతరం ఆమె ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈ దంపతులు బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ 3 కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తర్వాత వరుణ్ సందేశ్ తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.ఇక త్వరలోనే వరుణ్ సందేశ్ నటించిన నింద సినిమా( Ninda Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా జూన్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుణ్ సందేశ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఈయనకు మీరు బిగ్ బాస్ వెళ్లిన తర్వాత అది మీకు ఎంతవరకు మంచి చేసిందనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు వరుణ్ సమాధానం చెబుతూ బిగ్ బాస్ వెళ్లిన తర్వాత నా రీ ఎంట్రీ కి మంచి బూస్ట్ ఇచ్చిందా లేదా అనే విషయం పక్కన పెడితే నాకు ఆర్థికంగా ఇబ్బందులు తొలిగిపోయాయని తెలిపారు.బిగ్ బాస్ వెళ్లక ముందు రెండు సంవత్సరాలు నేను సినిమాలకు దూరంగా ఉన్నాను నేను నా ఫ్యామిలీ పై ఆధారపడి బ్రతకను కానీ ఈ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత ఫైనాన్షియల్ గా నాకు చాలా మంచి జరిగింది అంటూ వరుణ్ సందేశ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.