భారత్‌లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పర్యటన .. చర్చల్లో పన్నూన్ అంశం

ఖలిస్తాన్ వేర్పాటువాది , సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్ధాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ( Gurupatwant Singh Pannu )హత్యకు కుట్ర పన్నినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్.అమెరికాకు అప్పగించిన సంగతి తెలిసిందే.

 Gurpatwant Singh Pannun Issue Taken Up During Us Nsa Jake Sullivan's Visit To In-TeluguStop.com

పన్నూన్ హత్య కుట్రలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై అమెరికా ప్రభుత్వ అభ్యర్ధన మేరకు గతేడాది చెక్ రిపబ్లిక్‌లో నిఖిల్ గుప్తాను( Nikhil Gupta ) అరెస్ట్ చేశారు.న్యాయ పరమైన ప్రక్రియ ముగిసిన అనంతరం చెక్ ప్రభుత్వం నిఖిల్‌ను అమెరికాకు అప్పగించింది.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ .భారత్‌లో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా విదేశాంగ శాఖ, భద్రతా అధికారులతో జరిపిన సమావేశాలలో నిఖిల్ గుప్తా అంశం తెరపైకి వచ్చినట్లు సమాచారం.

వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ( White House spokesman John Kirby ) .గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వ్యవహారంపై స్పందించారు.జేక్ వ్యాఖ్యలకు తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

అమెరికా – భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు మార్గాలను అన్వేషించడమే సుల్లివన్ పర్యటన ప్రధాన లక్ష్యమన్నారు.యూఎస్ అధికారులు హై సెక్యూరిటీ టార్మాక్ నుంచి విజువల్స్ విడుదల చేయడానికి అనుమతించారు.

దీనిలో భాగంగా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది .నిఖిల్ గుప్తాను తీసుకెళ్తున్నట్లుగా ఓ ఫోటో వైరల్ అవుతోంది.భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను సుల్లివన్ కలవడంతో పాటు ధర్మశాలలో సిక్కుల ఆధ్యాత్మిక గురువు దలైలామాతో సమావేశానికి భారత ప్రభుత్వం అనుమతించడానికి ఒక రోజు ముందు నిఖిల్ గుప్తాను అమెరికా తన కస్టడీలోకి తీసుకుంది.

Telugu Gurpatwantsingh, York, Nikhil Gupta, Whitespokesman-Telugu Top Posts

మరోవైపు.పన్నూన్ హత్యకు కుట్ర కేసులో నిఖిల్ గుప్తాను న్యూయార్క్ కోర్టు ( New York court )ఎదుట హాజరుపరచగా.తాను నిర్దోషినని, తనపై నమోదు చేసిన అభియోగాలు నిరాధారమైనవని ఆయన వ్యాఖ్యానించారు.

నిఖిల్ గుప్తా జూన్ 28న మరోసారి కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది.నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేయగా.

అతడిని తమకు అప్పగించాలంటూ అగ్రరాజ్యం ఆ దేశంపై ఒత్తిడి తెచ్చింది.

Telugu Gurpatwantsingh, York, Nikhil Gupta, Whitespokesman-Telugu Top Posts

మరోవైపు నిఖిల్ అరెస్ట్, తదితర అంశాలపై భారత్ గతంలోనే స్పందించింది.నిఖిల్‌కు తమ దేశం నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని, అమెరికా వద్ద దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని భారత ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి.అలాగే నిఖిల్ గుప్తాకు న్యాయ సహాయం అందిస్తామని తెలిపాయి.

ఒకవేళ ఈ కేసులో అతని ప్రమేయం ఉందని తేలితే గుప్తాకు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube