నూతన్ ప్రసాద్ కుటుంబం గురించి తెలుసా..? ఇప్పుడు వారేం చేస్తున్నారంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ప్రసాద్( Nutana Prasad ) గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉందంటే అది అతిశయోక్తి కాదు.కాకపోతే ప్రస్తుతం తరం వారికి ఆయన గురించి తెలియకపోయే అవకాశం కూడా లేకపోలేదు.

 Whereabouts About Actor Nuthan Prasad Family ,nutana Prasad , Actor Nuthan Prasa-TeluguStop.com

అయితే ఇది వరకు నూతన ప్రసాద్ గొంతుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఇప్పటికీ కూడా ఆయన అభిమానులు కూడా ఉన్నారంటే నమ్మండి.

ఇక ఆయన బయోగ్రఫీ విషయానికి వెళ్తే.ఆయన అసలు పేరు తాడినాడ వరప్రసాద్.1945, డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కైకలూరులో( Kaikaluru, Krishna District, Andhra Pradesh ) జన్మించాడు.ఆపై బందరులో ఐటిఐ చదివిన ప్రసాద్, నాగార్జునసాగర్, హైదరాబాదులో ఉద్యోగాలు చేశాడు.

ఈయన జీవితంలో 30 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి అంకితమయ్యారు.

Telugu Nuthan Prasad, Andhra Pradesh, Himabindu, Kaikaluru, Krishna, Nutana Pras

గుంటూరు నగరంలో ప్రదర్శించిన ‘నా ఓటు’ అనే నాటకంతో ఆయన నటన ప్రస్థానాన్ని మొదలుపెట్టగా.1973లో అక్కినేని నాగేశ్వరావు నటించిన అందాల రాముడు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.అలా ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన నట ప్రస్థానాన్ని కొనసాగించారు.

ఈ నేపథ్యంలో ఆయనకి అనేక అవార్డులు కూడా దక్కాయి.ఆయన నటనకు గాను మొత్తంగా ఐదు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు.

పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, శ్రీవారికి ప్రేమలేఖ, కథానాయకుడు, అహనా పెళ్ళంట ఇలాంటి అనేక సినిమాలలో నూతన ప్రసాద్ నటించి మెప్పించారు.ఇక ఆయన తెలుగు చిత్రం పరిశ్రమలో చివరి సారిగా 2009 సంవత్సరంలో రాజు మహారాజా ( Raju maharaja )అనే సినిమాలో నటించి మెప్పించారు.

Telugu Nuthan Prasad, Andhra Pradesh, Himabindu, Kaikaluru, Krishna, Nutana Pras

ఆపై ఓ బుల్లితెర ఛానల్ లో ప్రసారమయ్యే నేరాలు-ఘోరాలు కార్యక్రమానికి తన గొంతుని అందించారు.సంఘటనలకు తగ్గట్టుగా ఆయన చెప్పే గంభీరమైన వాయిస్ వల్ల ఆ విషయాలు కళ్లకు కట్టినట్టుగా అర్థమయ్యేవి.అందుకే కాబోలు చాలామంది ఆయన గొంతుకి అభిమానులు అయ్యారు.అలాగే బుల్లితెరపై ఓ సీరియల్ లో కూడా నటించాడు.ఇకపోతే నూతన ప్రసాద్ కుటుంబం గురించి చాలామందికి తెలియదు.ఈయనకు ఓ భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నూతన ప్రసాద్ కొడుకు పేరు పవన్.పవన్ భార్య పేరు హిమబిందు( himabindu ).ఆవిడ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.రీల్స్ చేస్తూ నూతన ప్రసాద్ కుటుంబానికి సంబంధించిన పోస్ట్లు చేస్తూ ఉండడంతో ఆయనను గుర్తుకు చేస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube