ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడాలి అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila )బుధవారం మీడియాతో మాట్లాడటం జరిగింది.ఎన్నికల ఫలితాలు అనంతరం తొలిసారి స్పందించిన ఆమె ఈసారి జరిగిన ఎన్నికలు చాలా విచిత్రమని వ్యాఖ్యానించారు.

 Ys Sharmila Sensational Comments That Chandrababu Should Fight For Special Statu-TeluguStop.com

ఊహించని ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.మార్పు కావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని చెప్పుకొచ్చారు.

ఒకే నిర్ణయం మీద ఆధారపడి జరిగిన ఎన్నికలని.జగన్ మీద వ్యతిరేకత ఆధారంగా జరిగిన ఎన్నికలని అభివర్ణించారు.

ఈసారి ప్రజలు తమ ఓటుకి న్యాయం జరగాలని మార్పు కోరుకున్నారని స్పష్టం చేశారు.

ఈసారి ఎన్నికలలో ప్రజలు గట్టి నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్( Congress ) కూడా మంచి ఫలితాలు రాబట్ట లేకపోయిందని షర్మిల తెలిపారు.ఎన్నికలకు ముందు ఎనిమిది శాతం ఓటు బ్యాంకు వస్తుందని భావించి 64 నియోజకవర్గాలలో తాను పర్యటించినట్లు వెల్లడించారు.ప్రజలు ఈసారి ఒక్క ఓటు కూడా వృధా కావొద్దు అనుకున్నారని వ్యాఖ్యానించారు.

అందుకే జగన్ కి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు.ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని.2029లో అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో ఎన్నికల్లో గెలిచిన సీఎం చంద్రబాబు( CM Chandrababu )కి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.టీడీపీ వలనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడాలని సూచించారు.

పోలవరం పై శ్వేత పత్రం, కడప స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాజెక్టులపై బ్లూ ప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube