అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్( C M Ramesh ) సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల భూదందాలకు అధికారులు కూడా సహకరించారని వ్యాఖ్యానించారు.
వైసీపీ పాలనలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశారని మండిపడ్డారు.అవినీతి చేసిన ఏ అధికారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
అవినీతి దందాపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.తమ దృష్టికి కొంత మంది అధికారులు అవినీతికి పాల్పడినట్లు సమాచారం రావడం జరిగింది.
కచ్చితంగా వారందరిపై ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బయట నుంచి వచ్చిన రెడ్లు ఉత్తరాంధ్రలో దందాలు చేశారని భారీగా భూదోపిడి జరిగిందన్నారు.దోపిడీకి గురైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు.ఉత్తరాంధ్ర( Uttarandhra )లో జరిగిన భూదోపిడికి అధికారులు సహకరించటం బాధాకరమని వ్యాఖ్యానించారు.
పేదలకు సెంటు భూమి.జగన్ కు ఋషికొండ ప్యాలెసా అని ప్రశ్నించారు.
ఢిల్లీలో ఏపీ భవన్ అభివృద్ధి చేయలేదు కానీ జగన్( YS jagan ) కోసం రుషికొండలో ఖరీదైన ప్యాలెస్ అవసరమా అని ప్రశ్నించారు.ఉత్తరాంధ్రలో బిజెపి బలోపేతం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటినుంచి దృష్టి పెట్టి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.విశాఖలో అద్భుతమైన శాశ్వత కార్యాలయం నిర్మిస్తామని ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.