ఖరీదైన కారును కొనుగోలు చేసిన జబర్దస్త్ రీతూ చౌదరి.. కారు ఖరీదెంతంటే?

తెలుగు ప్రేక్షకులకు సీరియల్ నటి, జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి( Rithu_chowdary ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం రీతూ చౌదరి జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో అలాగే అప్పుడప్పుడు పండుగ ఈవెంట్లలో కూడా చేస్తూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

 Jabardasth Rithu Chowdary Buys A New Innova Crysta Hycross Luxury Car Know Price-TeluguStop.com

ఈమె మొదట యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.కాగా మొన్నటి వరకు సీరియల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతూ ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెని లాంటి షోలలో లేడీ కమెడియన్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఒక లగ్జరీ కారు( Luxury car ) కొనుగోలు చేసింది రీతు చౌదరి.కారును డెలివరీ తీసుకోవడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అమ్మతో కలిసి ఫస్ట్ డ్రైవ్ చేయడం తదితర కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ అన్నింటినీ ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసిందీ.కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఈ వీడియో వైరల్ అవడంతో రీతూ స్నేహితులు, బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు రీతూకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ లగ్జరీ కారు ధర విషయానికి వస్తే.బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.24.64 లక్షలుగా ఉంది.ఇందులోనే హైఎండ్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్ రూ.38.66 లక్షలుగా ఉంది.ఇక ఇన్నోవా క్రిస్టా హైక్రాస్ జెడ్ఎక్స్ హైబ్రిడ్ టాప్ మోడల్ ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ.45 లక్షల వరకు ఉంటుంది.ఈ లెక్కన చూస్తే రీతు చౌదరి లగ్జరీ కారు కొన్నట్లే అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube