టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనందరికీ తెలిసిందే.త్రివిక్రమ్ ఇప్పటివరకు దాదాపు దాదాపు 12 సినిమాలు తెరకెక్కించగా అందులో 9 సినిమాలు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మహేష్ బాబులతో తీసినవే.
అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబులతో ఒక్కొక్కరితో మూడు సినిమాలు చేశారు.అయితే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో చేసిన సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి.
కానీ మహేష్ బాబు( Mahesh Babu )తో మాత్రం అలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు.అతడు ఖలేజా, సినిమాలు కల్ట్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి కానీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయలేకపోయాయి.

ముచ్చటగా మూడోసారి చేతులు కలిపి గుంటూరు కారం( Guntur Kaaram ) చేయగా అది దారుణంగా నిరాశపరిచింది.దీంతో ఎలాగైనా మహేష్ బాబుకి బిగ్ హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.కాగా ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా రావడానికి కనీసం రెండు మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.ఈ సినిమా తర్వాత మహేష్ రేంజ్ మరింత పెరిగి, పాన్ ఇండియా స్టార్ గా అవతరిస్తాడు అనడంలో సందేహం లేదు.

అయితే రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత మహేష్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే ఉంటాయి.అందుకోసం త్రివిక్రమ్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టాడట.పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా అదిరిపోయే స్టోరీ లైన్ ని రెడీ చేసి మహేష్ కి వినిపించాడట.ఆ స్టోరీ లైన్ కి ఇంప్రెస్ అయిన మహేష్రాజమౌళి ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయ్యాక దీని గురించి డిస్కస్ చేద్దామని సానుకూలంగా స్పందించాడట.
ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమా కమిటై ఉన్నాడు.దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసే అవకాశముంది.ఆలోపు రాజమౌళి మహేష్ బాబు సినిమా కూడా పూర్తి కాడ ఉంది.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మండి పడుతున్నారు.
నీకు నీ సినిమాకు దండం అని కామెంట్స్ చేస్తున్నారు.