కనిపించింది ఒక్క సెకన్.. అంచనాలు మాత్రం పెరిగాయి.. ప్రభాస్ కు టాలీవుడ్ లో తిరుగులేదుగా!

మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రధాన పాత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప( Kannappa ) టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ కాగా ఈ సినిమాలోని మెజారిటీ సన్నివేశాలను న్యూజిలాండ్ లో షూట్ చేశారు.

 Prabhas Is The Number One Hero Tollywood Industry Details, Prabhas, Kannappa Mov-TeluguStop.com

అయితే ఈ సినిమా టీజర్ లో ప్రభాస్( Prabhas ) కనిపించింది ఒకే ఒక్క సెకన్ అయినా ప్రభాస్ కు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ను కన్నప్ప టీజర్ లో చూస్తే బాహుబలి 1 లో( Bahubali 1 ) శివుడిని చూసినట్టు ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ప్రభాస్ ఒక్క సెకన్ కనిపించినా అంచనాలు అమాంతం పెంచేశాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో కన్నప్ప కూడా ఒకటిగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

Telugu Kajal Aggarwal, Kannappa, Kannappa Teaser, Manchu Vishnu, Mohan Babu, Moh

దాదాపుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా పాన్ ఇండియా నటులు నటించడంతో అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.ప్రభాస్ ఈ సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్రలోనే కనిపించనున్నారని తెలుస్తోంది.మంచి విష్ణు కాంబినేషన్ సీన్స్ లో మాత్రం ప్రభాస్ కనిపించరని సమాచారం.ప్రభాస్ నందీశ్వరుడు పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

Telugu Kajal Aggarwal, Kannappa, Kannappa Teaser, Manchu Vishnu, Mohan Babu, Moh

కన్నప్ప సినిమా నుంచి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయని తెలుస్తోంది.కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.శివరాజ్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మంచు మోహన్ బాబు సైతం ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం.కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube