కనిపించింది ఒక్క సెకన్.. అంచనాలు మాత్రం పెరిగాయి.. ప్రభాస్ కు టాలీవుడ్ లో తిరుగులేదుగా!
TeluguStop.com
మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రధాన పాత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప( Kannappa ) టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ కాగా ఈ సినిమాలోని మెజారిటీ సన్నివేశాలను న్యూజిలాండ్ లో షూట్ చేశారు.
అయితే ఈ సినిమా టీజర్ లో ప్రభాస్( Prabhas ) కనిపించింది ఒకే ఒక్క సెకన్ అయినా ప్రభాస్ కు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ ను కన్నప్ప టీజర్ లో చూస్తే బాహుబలి 1 లో( Bahubali 1 ) శివుడిని చూసినట్టు ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ ఒక్క సెకన్ కనిపించినా అంచనాలు అమాంతం పెంచేశాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో కన్నప్ప కూడా ఒకటిగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
"""/" /
దాదాపుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా పాన్ ఇండియా నటులు నటించడంతో అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ ఈ సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్రలోనే కనిపించనున్నారని తెలుస్తోంది.మంచి విష్ణు కాంబినేషన్ సీన్స్ లో మాత్రం ప్రభాస్ కనిపించరని సమాచారం.
ప్రభాస్ నందీశ్వరుడు పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. """/" /
కన్నప్ప సినిమా నుంచి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే రానున్నాయని తెలుస్తోంది.
కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
శివరాజ్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మంచు మోహన్ బాబు సైతం ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం.కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తుండటం గమనార్హం.
శంకర్ పేరు చెబితేనే భయంతో పరుగులు పెడుతున్న స్టార్ హీరోలు…