బన్నీని సాయితేజ్ అన్ ఫాలో కావడంపై నిహారిక రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

తెలుగు ప్రేక్షకులకు మెగా డాటర్ కొణిదెల నిహారిక( Konidela Niharika ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నిహారిక ప్రస్తుతం సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

 Niharika About Sai Dharam Tej Unfollowed Allu Arjun Issue Details, Allu Arjun, S-TeluguStop.com

అలాగే ట్రైలర్, టీజర్ ఈవెంట్ లలో కూడా పాల్గొంటుంది.అందులో భాగంగానే తాజాగా నిహారిక తన కమిటీ కుర్రోళ్లు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చింది.

ఈ క్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి బన్నీని( Bunny ) తేజ్( Tej ) అన్ ఫాలో అయ్యాడనే విషయం గురించి ప్రశ్నించాడు.

దానికి నిహారిక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.అసలు ఆ విషయమే తనకు తెలియదన్నట్టుగా.మీరు చెప్పే వరకు తనకు తెలియదు అన్నట్టుగా తెలిపింది.అవునా? నిజమా? అన్నట్టుగా నిహారిక ఫేస్ పెట్టేసింది.ఒక వేళ అలా చేసి ఉంటే.ఎవరి రీజన్స్ వాళ్లకి ఉంటాయి కదా? అని తెలివిగా సమాధానం తెలిపింది.అయితే నిహారిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సూపర్ యాక్టింగ్ నీకు తెలీదా బాగానే యాక్టింగ్ చేస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే నిహారిక వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ, నటిస్తూ ఎంత బిజీగా ఉంటోందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఆమె కమిటీ కుర్రోళ్లు( Committee Kurrollu ) అనే వెబ్ మూవీని నిర్మించింది.టీజర్ లాంచ్ ఈవెంట్లో నిహారిక చిన్న స్పీచ్ ఇచ్చింది.

ఈ సందర్భంగా నిహారిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube