పవన్ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి సమస్య ఇదేనా.. అందుకే ఆలస్యం అవుతున్నాయా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పాలిటిక్స్ లో తన పవర్ ఏంటో చూపించిన సంగతి తెలిసిందే.జనసేన సాధించిన ఫలితాలు ఇతర రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.

 This Is The Problem For Pawan Kalyan Movies Details Here Goes Viral In Social Me-TeluguStop.com

అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడంతో ఆయన లుక్ మారిపోయింది.పవన్ కళ్యాణ్ వర్కౌట్లు చేసి లుక్ మార్చుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే మాత్రం పవన్ కు తిరుగుండదని చెప్పవచ్చు.

పవన్ డేట్ల కోసం ఆయన సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలు కళ్లు కాయలు చేసేలా ఎదురుచూస్తున్నారు.పవన్ కనీసం 10, 15 రోజులు డేట్లు కేటాయిస్తే ఓజీ, హరిహర వీరమల్లు షూటింగ్స్( OG, Hari Hara Veera Mallu )పూర్తవుతాయని తెలుస్తోంది.ఈ రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా అదరగొట్టే సినిమాలు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఓజీలో యాక్షన్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండగా హరిహర వీరమల్లు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.

ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపుగా 450 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.హరిహర వీరమల్లుకు ఏఎం రత్నం నిర్మాత కాగా ఓజీ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత కావడం గమనార్హం.ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మొదట విడుదలవుతుందో తెలియాల్సి ఉంది.హరిహర వీరమల్లు డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం కాగా ఓజీ సినిమా డిజిటల్ రైట్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలతో కనీసం నెల రోజులు అయినా బిజీ అయ్యే అవకాశం ఉంది.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వర్కౌట్లు చేసి లుక్ మార్చుకోవాల్సి ఉంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవన్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకునే సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube