మోసగాడితో ప్రేమలో పడ్డ చైనా మహిళ.. చివరికి ఎంత నష్టపోయిందో తెలిస్తే...?

ఆన్‌లైన్‌లో మోసాలు బాగా పెరిగిపోతున్నాయి.ఇంటర్నెట్‌లో పరిచయమైన వారిని ఎట్టి పరిస్థితులలో నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

 A Chinese Woman Who Fell In Love With A Cheater... If You Know How Much She Los-TeluguStop.com

అయినా కొంతమంది అమాయకులు వారిని నమ్మి మోసపోతున్నారు.ఈ మోసాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.తాజాగా చైనాకు చెందిన ఒక మహిళ మోసగాడితో ప్రేమలో పడి చివరికి రూ.11 లక్షలు నష్టపోయింది.

Telugu Chen, Latest, Myanmar, Nri, Scam, Shanghai-Telugu NRI

వివరాల్లోకి వెళితే, షాంఘై( Shanghai )కి చెందిన 40 ఏళ్ల మహిళ ‘హు’ ఆన్‌లైన్‌లో ‘చెన్’ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది.గత ఏడాది మే నెలలో ఒక డేటింగ్ సైట్ ద్వారా వీరిద్దరూ కనెక్ట్ అయ్యారు.చెన్ చాలా నమ్మదగిన వ్యక్తిలా కనిపించి, ‘అధిక రాబడి‘ ఇచ్చే ఒక పెట్టుబడి ఖాతా గురించి హుకు చెప్పాడు.అతని మాటలను నమ్మి, హు భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టింది.

కానీ, ఆమె డబ్బును విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు, అది ఒక మోసం అని తెలుసుకుంది.

Telugu Chen, Latest, Myanmar, Nri, Scam, Shanghai-Telugu NRI

చెన్ మోసగాడు అని తెలిసినప్పటికీ, హు అతనిపై తన భావాలను మార్చుకోలేదు.ఉత్తర మయన్మార్( Myanmar ) నుంచి తిరిగి రావడానికి అవసరమవుతాయని చెప్పినప్పుడు ఆమె మళ్ళీ నమ్మేసింది.అతను ఆమెను మరింత మోసం చేస్తూ ఎక్కువ డబ్బులు దోచేశాడు.

జోక్ ఏంటంటే ఆమె సహాయంతో అతడు మరిన్ని మోసాలు చేశాడు.అలా ఆమెను తన సైబర్ ఫ్రాడ్స్ లో భాగం చేశాడు.

ఈ కేసులను టేకప్ చేసిన పోలీసులకు లావాదేవీలు హు ఖాతా ద్వారా జరిగాయని తెలిసాయి, కాబట్టి పోలీసులు ఆమెను పట్టుకున్నారు.లాభాలను తీసుకోకుండా, బాధితురాలిలా నటిస్తే సురక్షితంగా ఉండవచ్చని చెన్ ఆమెను ఒప్పించాడు.

సెప్టెంబర్‌లో, హును పోలీసులు అరెస్ట్ చేశారు.ఆమె తన తప్పును ఒప్పుకుంది.

అయితే, ఆమె కూడా మోసంలో పాల్గొన్నదని తేలినందున, ఆమెకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.చూశారు కదా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి కారణంగా ఈ చైనీస్ మహిళా జీవితం ఎలా నాశనమైందో కాబట్టి ఎంత మంచిగా మాట్లాడినా సరే అపరిచిత వ్యక్తులను నమ్మకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube