నయనతార భర్తతో గొడవ గురించి స్పందించిన విజయ్ సేతుపతి.. అసలు సమస్య ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో నయనతార( Nayanthara ) ఒకరు కాగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ తో( Vignesh Shivan ) విజయ్ సేతుపతి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి రాగా ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే.అయితే గతంలో విఘ్నేష్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) చాలా సినిమాల్లో నటించారు.

 Vijay Sethupathi Comments About Vignesh Shivan Details, Vijay Sethupathi, Vignes-TeluguStop.com

నయనతార భర్తతో గొడవ గురించి స్పందించి విజయ్ సేతుపతి క్లారిటీ ఇవ్వగా ఆ కామెంట్స్ వైరల్ అవుతుండటం గమనార్హం.

నేనూ రౌడీనే సినిమా( Nenu Rowdy Ne Movie ) తొలిరోజు షూటింగ్ తర్వాత విఘ్నేష్ కు ఫోన్ చేసి నేను గొడవ పడ్డానని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.

నువ్వు నాకు నటన నేర్పుతున్నావా.నేను చేసేది నీకు అర్థం కావట్లేదు అని గట్టిగా అరిచానని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.నాలుగు రోజుల తర్వాత నయన్ మా ఇద్దరితో మాట్లాడి నచ్చజెప్పడం జరిగిందని విఘ్నేష్ శివన్ కామెంట్లు చేశారు.

విఘ్నేష్ శివన్ ఆ స్క్రిప్ట్( Script ) చెప్పినప్పుడు కొత్తగా అనిపించిందని షూటింగ్ ప్రారంభమైన తర్వాత విఘ్నేష్ శివన్ ను అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించిందని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.ఇప్పుడు విఘ్నేష్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యామని విజయ్ సేతుపతి వెల్లడించారు.ఆ సినిమాలో నా రోల్ తెలుసుకోవడానికి నాలుగు రోజులు పట్టిందని కొన్ని సీన్స్ లో చేసే సమయంలో అభద్రతాభావానికి లోనయ్యానని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.

విఘ్నేష్ శివన్ టాలెంట్ ఉన్న డైరెక్టర్ అని ఎవరూ టచ్ చేయని కథలను కొత్తగా తీస్తారని ఆయన తెలిపారు.విఘ్నేష్ శివన్ పై నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టిస్తాడని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.విఘ్నేష్ శివన్ గురించి ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube