పవన్ మామ భారీ విజయం.. మొక్కు చెల్లించుకున్న మెగా మేనల్లుడు?

సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) 2024 అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈయన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయం అందుకోలేదు.

 Sai Dharam Tej Visited Tirumal Photos Goes Viral Details, Sai Dharam Tej, Pawan-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈసారి పొత్తులో భాగంగా జనసేన( Janasena ) పోటీ చేసిన ప్రతి చోట అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం( Pitapuram ) నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఈ నియోజకవర్గంలో సుమారు 70000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపు అందుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కోసం పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యులందరూ పిఠాపురం వెళ్లి పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే.ఇలా తన గెలుపులో తన కుటుంబ సభ్యులు కూడా భాగమయ్యారు.ఇక పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ఈయన ఇటీవల డిప్యూటీ సీఎంగా అలాగే ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు అందుకోవడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం అందుకోవడంతో తన అల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) మొక్కులు చెల్లించుకున్నారు.తన మామయ్య గెలవాలని ఈయన తిరుమల శ్రీవారికి మొక్కుకున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం అందుకోవడంతో సాయి ధరమ్ తేజ్ కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా పవన్ కళ్యాణ్ అంటే ప్రాణంగా అభిమానించే సాయి తేజ్ తన మామయ్య గెలుపును పండగలగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈయన తిరుమలకు కాలినడకన వెళ్లడంతో అభిమానులు కూడా ఈయనతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube