Exam Diet :పరీక్షల సమయంలో మీ పిల్లల డైట్ ను ఇలా సిద్ధం చేయండి..!

పిల్లల ఆహారం( Children Diet ) విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ కంగారు పడుతూనే ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్న నేపథ్యంలో వారి భోజన విషయంలో తల్లిదండ్రులు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు.

 Foods That You Must Give Your Child During Examsfoods That You Must Give Your C-TeluguStop.com

చదువు దిశలో పడి పిల్లలు సరిగ్గా భోజనం తినకపోతే నీరసించి పరీక్షలు రాయలేక పోతారు.అలాంటి సమయంలో తల్లిదండ్రులే( Parents ) తమ పిల్లల డైట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం తీసుకునే అల్పాహారంలో నూనె వస్తువులు లేకుండా చూసుకోవాలి.

Telugu Foods, Diet, Exam Diet, Tips-Telugu Health

ఆయిల్ ఫుడ్స్( Oil Foods ) ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల తరచుగా దాహం వేసి పరీక్షల సమయంలో( Exams Time ) విద్యార్థుల మూడు చెడిపోయే అవకాశం ఉంది.అయితే ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి.లేకపోతే బ్లడ్ లో గ్లూకోస్ లెవెల్స్ పడిపోయి, త్వరగా నిరసించిపోతారు.సులువుగా అరిగే ఆహార పదార్థాలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే ఇడ్లీ తీసుకోవడం ఎంతో మంచిది. మిక్స్డ్ వెజిటేబుల్ కిచిడి, గోధుమ రవ్వ ఉప్మా, కూడా టిఫిన్ గా తీసుకోవచ్చు.

టిఫిన్ తిన్నాక పాలు తాగడం మర్చిపోకూడదు.ఉదయం ఏడు గంటల నుంచి 8 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ ముగించాలి.

ఇంకా చెప్పాలంటే విద్యార్థులు చదివింది గుర్తు పెట్టుకోవడానికి విటమిన్ బి12( Vitamin B12 ) ఎంతగానో ఉపయోగపడుతుంది.దుమాపకశక్తి పెరుగుదలకు ఉపయోగపడే ఈ విటమిన్ మాంసపు ఉత్పత్తులు అధికంగా ఉంటుంది.

Telugu Foods, Diet, Exam Diet, Tips-Telugu Health

అయితే చికెన్, మటన్లను నేరుగా కాకుండా ఇది తింటే పరీక్షల సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది.మాంసం తినడానికి ఇష్టపడని వారు రోజుకు రెండు ఉడికించిన గుడ్లు( Boiled Egggs ) తినడం మంచిది.మధ్యాహ్నం భోజనంలో ఒక ఆకుకూర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.అంతే కాకుండా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి.భోజనం తర్వాత ఏదైనా ఒక పండు తింటే ఇంకా మంచిది.సాయంత్రం నాలుగు గంటలకు స్నాక్స్ తీసుకోవడం ఎంతో మంచిది.

అలాగే రాత్రి సమయంలో ఏడు గంటల 30 నిమిషముల లోపు రాత్రి భోజనం పూర్తి చేయాలి.అలాగే నిద్రపోవడానికి ఒక గంట ముందు గ్లాసు పాలు( Milk ) తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అలాగే రాత్రిళ్ళు ఎక్కువ సమయం మేల్కోకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే కనీసం ఏడు నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube