వీడియో: చిన్నారి బర్త్‌డే పార్టీలో షో చేశారు.. ఫైర్‌వర్క్స్ మీద పడటంతో..?

ఇటీవల కాలంలో పెళ్లళ్లు, పుట్టినరోజు లాంటి వేడుకలను ఘనంగా, ఖరీదైనదిగా సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు.అలాగే తమ సెలబ్రేషన్స్ గురించి అందరూ మాట్లాడుకునేలాగా చేయాలనుకుంటున్నారు.

 Birthday Party Firecrackers Gone Wrong Viral On Social Media, Viral Video, Viral-TeluguStop.com

అలా చేయడానికి ప్రాణాలను రిస్క్‌లో పెట్టడానికి కూడా వెనకాడడం లేదు.భారీగా డబ్బు ఖర్చు పెట్టి చేసే పనుల వల్ల ప్రమాదాలు ఉన్నాయని మర్చిపోతున్నారు.

తాజాగా ఒక జంట తమ కుమారుడికి బర్త్ డే సందర్భంగా బాణాసంచా( Firecrackers ) కాల్చారు.అదే వారికి చెడు చేసింది.

దానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో పుట్టినరోజు పార్టీ( Birthday party )లో బాణాసంచా వెలిగించడం వల్ల జరిగిన ప్రమాదం కనిపించింది.ఆ వీడియోలో, ఓ దంపతులు పార్టీ హాల్‌కి వస్తున్నారు.వారితో పాటు వారి బిడ్డ కూడా ఉంది.

బిడ్డ రోల్లర్ కోస్టర్ లాంటి ఊయలలో కూర్చుంది.ఆ దంపతుల చుట్టూ ఫైర్ క్రాకర్స్ వెలిగించారు.

కానీ, ఒక ఫైర్ క్రాకర్ చాలా దగ్గరగా వెలిగించడం వల్ల ఆ తల్లికి, బిడ్డకు గాయాలు అయ్యాయి.బిడ్డ చాలా భయపడింది.

వెంటనే ఓ మహిళ ఆ బిడ్డని తీసుకొని ప్రమాదం నుంచి కాపాడింది.ఆ తండ్రి గాయపడిన భార్యకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు.

ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు.చాలా మంది ఆ తల్లిదండ్రుల ప్రవర్తనను ప్రమాదకరంగా, అజాగ్రత్తగా భావించారు.పిల్లలు ఉన్న చోట ఫైర్ క్రాకర్స్‌ వెలిగించడం చాలా ప్రమాదకరమని, దాని వల్ల చాలా నష్టాలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.గతంలో జరిగిన వేడుకల్లో ఫైర్ క్రాకర్స్‌ వెలిగించడం వల్ల జరిగిన ప్రమాదాల గురించి కూడా చాలా మంది గుర్తు చేశారు.

అలాంటి ప్రమాదాల వల్ల గాయాలు, మరణాలు కూడా సంభవించాయని వారు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube