పార్టీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్న కేసీఆర్ .. ఆ కమిటీల రద్దు ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) బీఆర్ఎస్ ఘోరంగా ఓటమి చెందడంతో పాటు,  ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్( BRS ) అభ్యర్థులు విజయం సాధించకపోవడం వంటివి ఆ పార్టీలో నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి.బీఆర్ఎస్ పని అయిపోయిందని ,ఇక కోలుకునే ఛాన్స్ లేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో , బీఆర్ఎస్ ను భారీగా ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

 Kcr, Who Is Preparing To Cleanse The Party, Cancel Those Committees , Brs, Bjp,-TeluguStop.com

కేత్ర స్థాయిలో బలోపేతం చేసే విధంగా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని కేసిఆర్ నిర్ణయించుకున్నారు .అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితిపై కేసీఆర్ ( KCR )ఒక అంచనాకు వచ్చారు .పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడంతో నష్టం జరుగుతోందని , పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పగించాలని కెసిఆర్ కు అందిన సూచనలను అమలు చేసే దిశగా ఆయన ముందడుగు వేయబోతున్నారు.

Telugu Brs Committees, Brs, Congress, Telangana, Ts-Politics

 ఈ మేరక పార్టీ అనుబంధ కమిటీలను సైతం పూర్తిస్థాయిలో నియమించి కేడర్ ను యాక్టివ్  చేయాలని భావిస్తున్నారు.  ఈ మేరకు కేడర్ కు శిక్షణ ఇవ్వడంతో పాటు , కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.  జిల్లాలో బలమైన నేతలను గుర్తించి బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు మొదలుపెట్టారు.ఈ మేరకు బీఆర్ఎస్ జిల్లా కమిటీలను 2022 జూన్ లో ప్రకటించారు దీనిలో అసిఫాబాద్ , నిర్మల్ జిల్లాల అధ్యక్షులు పార్టీ మారడంతో అక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి.జిల్లాలో పూర్తిస్థాయి కమిటీలను నియమించలేదు.19 జిల్లాల్లో అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించడంతో, పార్టీలోని సీనియర్లు,  ఉద్యమకారులు అసంతృప్తికి గురయ్యారని కెసిఆర్ ఆలస్యంగా గుర్తించారు.

Telugu Brs Committees, Brs, Congress, Telangana, Ts-Politics

ఇవన్నీ బీఆర్ఎస్ ఓటమికి కారణం అయ్యాయి అని గుర్తించారు.పార్టీ అనుబంధ కమిటీలైన మహిళ, యువత, రైతు, కార్మిక ,విద్యార్థి,  సోషల్ మీడియా కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం , బాధ్యతలు లేకుండా పార్టీలో పనిచేస్తున్న వారు అసంతృప్తికి గురవడం వంటి అన్నిటిని ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని, కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కెసిఆర్ ముందడుగు వేస్తున్నారు.విస్తృత స్థాయి సమావేశం పేరుతో రాష్ట్ర కమిటీ సభ్యులు ,ఎంపీలు, ఎమ్మెల్యేలు , డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్ లను పిలిచి కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు .పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సలహాలు,  సూచనలు తీసుకుంటున్నారు.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీలను రద్దు చేయాలని కేసిఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.యాక్టివ్ గా పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించాలని,  అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో యాక్టివ్ గా పనిచేసిన నేతలను గుర్తించి వారికి పదవులు ఇచ్చే విధంగా త్వరలోనే పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube