అమెరికాలో శాశ్వత నివాస హోదా( Permanent Residency ) పొందేందుకు భారతీయులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.కంట్రీ క్యాప్ నిబంధన కారణంగా భారత్ , చైనా వంటి పెద్ద దేశాలకు చెందిన వలసదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇలా నిరీక్షిస్తూ పోతే 200 ఏళ్లు గడిచినా భారతీయులకు గ్రీన్ కార్డ్( Green Card ) రావడం కష్టమే.ఈ విషయంలో చొరవ చూపి భారతీయుల కష్టాలను తొలగించాలని అమెరికాలోని( America ) ప్రవాస భారతీయులు, చట్టసభ సభ్యులు పలుమార్లు ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం .ప్రస్తుతం ఒక మిలియన్‌కు పైగా ప్రజలు ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్‌లో సుదీర్ఘమైన బ్యాక్‌లాగ్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొంది.కంట్రీ క్యాప్ నిబంధన కారణంగా భారతీయులు శాశ్వత నివాసం పొందడానికి దశాబ్థాలుగా వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమెరికాలో గ్రీన్ కార్డ్‌ను పొందిన ఇంజనీర్, వ్యాపారవేత్త రవిటాండన్‌కు( Ravi Tandon ) సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే గ్రీన్ కార్డ్ పొందే క్రమంలో తాను ఎదుర్కొన్న అడ్డంకులు, ఎదురుదెబ్బలను రవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.విజయం సాధించాలనే అతని సంకల్పం చివరికి ఫలించింది.
రవి టాండన్ అమెరికా ప్రయాణం .2008లో అతను ఐఐటీ గౌహతిలో చేరినప్పుడు ప్రారంభమైంది.గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అతను ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో( Princeton University ) అడుగుపెట్టాడు.అక్కడ 2015లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ (ఎంఎస్ఈ) పూర్తి చేశారు.
బే ఏరియాలోని థాట్‌స్పాట్‌లో స్టాఫ్ ఇంజనీర్‌గా రవి టాండన్ కెరీర్ ప్రారంభమైంది.ఐదు సంవత్సరాలు అక్కడ పనిచేసిన కాలంలో ఆయన తన నైపుణ్యాలను మెరుగుపరచుకున్నాడు.
అనంతరం సొంతంగా స్టార్టప్‌ను( Startup ) స్థాపించాలని ఆకాంక్షించాడు.అయితే వీసా పరిమితుల కారణంగా అమెరికాలో దీనిని నిర్వహించడం సవాల్ అని రవి తెలుసుకున్నాడు.
ఈ క్రమంలో భారత్‌కు తిరిగి వచ్చి 2021లో ఎఫ్ 2 వీసాపై అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
మార్చి 2023లో అతను ఈబీ-1ఏ వీసా( EB-1A Visa ) కోసం తన దరఖాస్తును సమర్పించాడు.నెలలకొద్దీ నిరీక్షణ, కఠినమైన వడపోత తర్వాత డిసెంబర్ 2023 నాటికి రవి దరఖాస్తును అధికారులు ఆమోదించారు.అసాధారణ సామర్థ్యం కలిగిన అమెరికాయేతర నివాసితులకు ఈబీ-1ఏ వీసా ఇస్తారు.
సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ లేదా అథ్లెటిక్స్ రంగాలలో అసాధారణమైన నైపుణ్యాలు కలిగిన వ్యక్తికి ఈ వీసా అందజేస్తారు.