స్టార్ హీరోస్ అవుతారు అనుకున్న ఈ ముగ్గురి కెరియర్ ఎందుకు నాశనం అయ్యింది ?

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది ఎంతో అదృష్టంతో కూడుకున్న పని.అలా అవకాశం వచ్చి చాలామంది స్టార్స్ అయ్యారు.

 Why These 3 Heros Turns Into Flops ,varun Sandesh, 3 Heros Turns Into Flops, Raj-TeluguStop.com

అంతే మంది సినిమా ఇండస్ట్రీ నుంచి కనబడకుండా వెళ్లిపోయారు.అయితే ఒక ముగ్గురు స్టార్ హీరోలు అయితే సూపర్ స్టార్ అయిపోతారని జనాలు అప్పట్లో అనుకున్నారు కానీ వారి ముగ్గురు కెరియర్ ప్రస్తుతం చరమంకానికి చేరుకుంది.మరి ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన ఈ స్టార్స్ జీవితం ఇలా అయిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వరుణ్ సందేశ్

( Varun Sandesh )

హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం ( Happy days, kotta bangaru lokam )వంటి సినిమాలు చూసిన ఎవ్వరైనా సరే వరుణ్ సందేశ్ పెద్ద స్టార్ అయిపోతారు అని అనుకుంటారు.కానీ ఆయన కెరియర్ లో ఈ రెండు సినిమాలు మాత్రమే చెప్పుకోదగ్గ చిత్రాలు.ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా కూడా ఆయనకు రావాల్సిన పాపులారిటి రాలేదు.

కథలు ఎంపికలో చేసిన పొరపాట్లు మాత్రమే వరుణ్ సందేష్ ఇలా అయిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Telugu Adi Saikumar, Raj Tarun, Tollywood, Varun Sandesh-Telugu Top Posts

రాజ్ తరుణ్

ఉయ్యాల జంపాల చిత్రంతో రాజ్ తరుణ్( Raj Tarun ) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమాకి అప్పట్లో మంచి వసూళ్లను సాధించడం తో పాటు రాజ్ తరుణ్ చూసిన వారు అంతా కూడా పెద్ద హీరో అవుతాడు బాగా నటిస్తున్నాడు అని చెప్పుకున్నారు.ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు పరవాలేదు.కానీ కథల ఎంపిక బాగోలేక ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి కెరీర్ కోల్పోయాడు.

Telugu Adi Saikumar, Raj Tarun, Tollywood, Varun Sandesh-Telugu Top Posts

ఆది సాయికుమార్

ఆది సాయికుమార్( Adi Saikumar ) తండ్రి వారసత్వంతోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రేమ కావాలి అని చిత్రంతో మొదటగా నటుడు అయ్యాడు.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది పైగా ఈ సినిమాలోని పాటలకు మంచి కల్ట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.దాంతో ఆది సైతం ఎక్కడికో వెళ్ళిపోతాడు అని అందరు అనుకున్నా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే పరాజయాలు అందుకుంటూ ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube