బుల్లితెర సీరియళ్ల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కరుణ( Karuna bhushan ) ఒకరు.ఈ ప్రముఖ నటి రెండోసారి తల్లి కాగా కవల పిల్లలకు జన్మనిచ్చారు.
చాలా సంవత్సరాల క్రితం కరుణ సీరియల్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నారు.ఈ నటికి ఇప్పటికే పది సంవత్సరాల వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు.
ఈ నటి కొన్ని సినిమాలలో కూడా నటించారు.కరుణ భూషణ్ ట్విన్స్ కు తల్లి కాగా తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఇన్ స్టాలో చెప్పుకొచ్చారు.
ఆహా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కరుణ ఎంట్రీ ఇచ్చారు.శంకర్ దాదా ఎంబీబీఎస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కాటమరాయుడు సినిమాలలో ఆమె నటించారు.మొగలి రేకులు, వైదేహి పరిణయం మరికొన్ని సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించారు.అభిషేకం సీరియల్ నటిగా ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది.ప్రెగ్నెన్సీ నుంచి పిల్లల్ని కనే వరకు తన ప్రయాణం గురించి ఆమె తెలిపారు.
కరుణ భూషణ్ చేసిన పోస్ట్ కు 65 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.మొగలి రేకులు( Mogali rekulu ) హీరోయిన్ ఇద్దరు పిల్లలకు తల్లి కావడంతో నెటిజన్లు సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.కరుణ భూషణ్ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉంది.
కరుణ భూషణ్ త్వరలో సీరియల్స్ లోకి రీఎంట్రీ ఇచ్చి మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కరుణ భూషణ్ కు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
కరుణ వయస్సు పెరుగుతున్నా యంగ్ గానే కనిపిస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కరుణ గతంలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ ద్వారా వార్తల్లో నిలిచారు.అలాంటి వివాదాలకు ఆమె దూరంగా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కరుణకు ఇండస్ట్రీలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.