అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( AP CM Chandrababu NAIDU ) ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ముందుగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల విషయంలో నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

 Minister Narayana Key Announcement On The Opening Of Anna Canteens Minister Nara-TeluguStop.com

దీనిలో భాగంగా ఇప్పటికే మెగా డీఎస్సీ( Mega DSC ) ప్రకటనపై మొదటి సంతకం చేయడం జరిగింది.తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) రద్దు, పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైల్ పై సంతకాలు చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఆదివారం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ అన్న క్యాంటీన్ ల పునరుద్ధరణ పై సంచలన ప్రకటన చేశారు.;

విషయంలోకి వెళ్తే మూడు వారాలలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ లు తెరవబోతున్నట్లు స్పష్టం చేశారు.

నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ( Minister Narayana ).అన్నా క్యాంటీన్ ల ఏర్పాటుపై సమీక్షించారు.ఈ సందర్భంగా గతంలో 203 అన్నా క్యాంటీన్ లకు అనుమతి ఇచ్చామని 19 మినహా అన్ని అప్పట్లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.అన్నా క్యాంటీన్ లో రోజు 2,20,000 మంది తినేవారని మొత్తంగా.

ఈ క్యాంటీన్ ల ద్వారా నాలుగు కోట్ల అరవై లక్షల మందికి ఆహారం అందించినట్లు గుర్తు చేశారు.త్వరలోనే మళ్లీ అన్న క్యాంటీన్ ల సేవలు మూడు వారాలలో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

అయితే వీటి నిర్వహణ మళ్ళీ ఇస్కాన్ కి ఇవ్వాలా.? లేదా టెండర్లు పిలవాలా.? అనేదానిపై అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube