అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( AP CM Chandrababu NAIDU ) ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ముందుగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల విషయంలో నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

దీనిలో భాగంగా ఇప్పటికే మెగా డీఎస్సీ( Mega DSC ) ప్రకటనపై మొదటి సంతకం చేయడం జరిగింది.

తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) రద్దు, పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్ ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైల్ పై సంతకాలు చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఆదివారం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ అన్న క్యాంటీన్ ల పునరుద్ధరణ పై సంచలన ప్రకటన చేశారు.

; విషయంలోకి వెళ్తే మూడు వారాలలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ లు తెరవబోతున్నట్లు స్పష్టం చేశారు.

నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ( Minister Narayana ).అన్నా క్యాంటీన్ ల ఏర్పాటుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా గతంలో 203 అన్నా క్యాంటీన్ లకు అనుమతి ఇచ్చామని 19 మినహా అన్ని అప్పట్లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.

అన్నా క్యాంటీన్ లో రోజు 2,20,000 మంది తినేవారని మొత్తంగా.ఈ క్యాంటీన్ ల ద్వారా నాలుగు కోట్ల అరవై లక్షల మందికి ఆహారం అందించినట్లు గుర్తు చేశారు.

త్వరలోనే మళ్లీ అన్న క్యాంటీన్ ల సేవలు మూడు వారాలలో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

అయితే వీటి నిర్వహణ మళ్ళీ ఇస్కాన్ కి ఇవ్వాలా.? లేదా టెండర్లు పిలవాలా.

? అనేదానిపై అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.