ఈ సృష్టిలో స్నేహం అనేది చాలా ముఖ్యమైన అంశం.అది మనుషులకైనా సరే లేదంటే జంతువులకు అయినా సరే స్నేహం విషయంలో ఒక్కటే.
స్నేహితులు లేని జీవితం వ్యర్థం లేనిదని కూడా చెబుతుంటారు పెద్దలు.మరి అంత విలువైన స్నేహానికి హద్దులు చెరిపేస్తున్నారు ఇప్పటి తరం.
ఇక జంతువుల్లో కూడా ఇంతే.తమ జాతి కాకపోయినా కూడా ఇతర జాతులకు చెందిన వాటితో స్నేహం చేస్తుంటాయి చాలా జంతువులు.
ఇప్పుడు కూడా ఇలాంటి ఓ స్నేహం గురించి తెలుసుకుందాం.ఓ గుర్రం మేకలతో స్నేహం చేస్తోంది.
వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ.కానీ ఇదే నిజం.ఆ గుర్రం వాటితో ఎంతో ప్రేమగా మెలుగుతోంది.ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు అంటేనే సోషల్ మీడియా వెతికి మరీ పట్టుకొస్తుంది.
ఇక ఇలాంటి వీడియోను కూడా అలాగే పట్టుకొన్ని వైరల్ అవుతోంది.ఇక ఇప్పుడు తాజగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఎందుకంటే ఇందులో ఓ గుర్రం, రెండు మేకలు ఎంచక్కా స్నేహం చేసేసుకుంటున్నాయి.ఇక గుర్రం కూడా ఆ మేకలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటోంది.
ఇందుకు నిదర్శనంగా ఆ మేకలు గుర్రంపై ఎక్కి మరీ స్వారీ చేస్తున్నాయంటే వాటి అన్యోన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.అసలు గుర్రం సాధారణంగా తనపైకి ఎవరినీ ఎక్కనీయదు.శిక్షణ తీసుకుంటే దాని మీదకు ఎవరినీ అనుమతించదు.అలాంటిది ఈ మేకలు మాత్రం స్వారీ చేసే విధంగా గుర్రంపైకి ఎక్కుతున్నట్టు మనకు కనిపిస్తోంది.కాగా ఆ గుర్రం చుట్టూ చాలా వరకు మేకలు సరదాగా తిరుగుతూ ఉన్నాయి.ఇంకొన్ని మేస్తున్నాయి.
ఇలా ఆ గుర్రం తన జాతి కాకపోయినా కూడా ఆ మేకలతో సరదాగా ఆడుకుంటోంది.ఈ వీడియోపై మీరు కూడా స్పందించండి.
.