దాదాపు నాలుగు నెలలు ముందు మొదలైన రష్యా – యుక్రెయిన్ యుద్ధం నేటికీ ఇంకా కొనసాగుతూనే వుంది.ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పలు వీడియోలు చూస్తే మనసు కకావికలం అయిపోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో జనాల గుండెలను పిండేస్తోంది.గాయంతో బాధపడుతున్న ఓ ఉక్రెయిన్ బాలికకు బ్యాండేజ్ కడుతుంతే ఆ చిన్నారి జాతీయ గీతాన్ని పాడుతూ బాధను భరిస్తూ కూడా రష్యా చేస్తున్న దురాగతాలను కళ్ళముందు మెదిలే చేసింది.
ఉక్రెయిన్ అంతర్గత శాఖ మంత్రి ఆంటోన్ గెరాష్‌చెంకో ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి, “అన్‌బ్రేకబుల్.బ్యాండేజ్‌లు కట్టించుకుంటూ ఓ చిన్నారి ఉక్రెయిన్ జాతీయ గీతాన్ని ఆలపిస్తోంది” అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చి మరీ పోస్ట్ చేసారు.
అయితే బాలిక కాలికి గాయాలు ఎలా అయ్యాయన్న విషయం ఇంకా తెలిరాలేదు.ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఆ చిన్నారి కాలికి నర్సులు బ్యాండేజీ కడుతుండగా నొప్పిని భరిస్తూనే బాలిక జాతీయ గీతాన్ని ఆలపిస్తుండడం చూస్తే గుండెలు విలవిలలాడుతాయి.గురువారం పోస్టు చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 1.58 లక్షలకు పైగా వ్యూస్ రాగా, 11 వేలకు పైగా లైకులు వచ్చాయి.2వేల సార్లు రీట్వీట్ అయింది.
ఇకపోతే దేశంపట్ల వున్న భక్తికి ఆ చిన్నారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.ఈ నేపథ్యంలో అనేకమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఓ బాలిక చేతిలో పుతిన్ ఓడిపోయాడని, పుతిన్ సిగ్గుతో తల దించుకో.
అంటూ ఓ యూజర్ కామెంట్ చేస్తే, ఇంత చిన్న వయసులోనే ఉక్రేనియన్లలో కావాల్సినంత ధైర్యం నింపారని మరొకరు కామెంట్ చేశారు.మరికొంతమంది ‘చల్లగా ఉండు తల్లీ.ఉక్రేనియన్ల స్ఫూర్తి ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు’ అని దీవిస్తూ కామెంట్లు పెడుతున్నారు.హృదయవిదారకంగా వున్న ఆ వీడియోని మీరు కూడా తిలకించండి.