కూతురు మొండిగా ఉంటుందని..మనుషులు లేని దీవిలో వదిలేసిన తల్లిదండ్రులు!

పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు.చిన్న పిల్లలైతే బ్రతిమిలాడి లేదంటే నచ్చజెప్పి ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు.

 Parents Bring Girl To Desert Island For Psychological Cure, Parents Dump Girl In-TeluguStop.com

అదే టీనేజ్ పిల్లలు అయితే ఒక దెబ్బ వేసి అయినా చెప్పిన మాట వినేలా చేసుకుంటారు.ఈ వయసులో వారు వాళ్ళు ఏదంటే అదే జరిగిపోవాలని పంతం పట్టుకుని కూర్చుంటారు.

ఏది చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తుంటారు.

కానీ తల్లిదండ్రులు ఓపికగా వారిని దారిలోకి తెచ్చుకోవాలి.

కొంతమంది తెలివిగా వాళ్ళ పిల్లలను దారిలోకి తెచ్చు కుంటారు.వారి అల్లరి తట్టుకోవడం కష్టమైన కూడా కంట్రోల్ చేయడం అలవాటు చేసుకోవాలి.

లేకపోతే వారు చెడు మార్గాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.అందుకోసం కొంతమంది కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే తల్లిదండ్రులు కూడా అలానే చేసారు.

వాళ్ళ కూతురు మొండిగా ఉంటుందని తనని దారిలోకి తెచ్చుకోవాలని వాళ్ళు కూడా కఠిన మైన నిర్ణయం తీసుకున్నారు.

ఏం చేసారంటే.వాళ్ళ కూతురును మనుషులు ఎవ్వరు తిరగని దీవిలోకి వదిలి పెట్టి వెళ్లిపోయారు.

ఈ ఘటన చైనాలో జరిగింది.షాండాంగ్ ప్రావీన్స్ సముద్ర జలాల్లో ఒక బాలిక ఒంటరిగా ఉన్న దృశ్యం అక్కడ వేటకు వెళ్లిన జాలర్ల కంట పడింది.

ఆ బాలికకు 13 ఏళ్ల వయసు ఉంటుంది.ఆ జాలర్లు ఆమెను ఒంటరిగా ఎలా వచ్చావని అడగగా.ఆమె అసలు విషయం తెలిపింది.ఆ బాలిక స్కూల్ కు వెళ్లడం లేదని ఇంట్లోనే ఉంటుందని వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను ఆ దీవిలో ఒంటరిగా వదిలేశారని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్య పోయారు.

అప్పటికే ఆ బాలిక ఆ దీవికి వచ్చి రెండు రోజులు అయిందని.నగరానికి తీసుకెళ్లమని వారిని కోరడంతో ఆ జాలర్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు ఆ బాలిక దగ్గరకు వాళ్ళ తల్లిదండ్రులను కూడా వెంట తీసుకుని వచ్చి ఆమెను తిరిగి తీసుకెళ్లాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వాళ్ళు ఆ బాలికను తీసుకెళ్లేందుకు అంగీకరించారు.చెప్పిన మాట వినడం లేదనే కూతురుకు గుణపాఠం చెప్పాలనే ఆమెను అక్కడ వదిలి పెట్టమని వాళ్ళు పోలీసులకు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube