వైరల్: ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు..!

దేశంలో ఉండే అన్ని మహానగరాలలో ట్రాఫిక్ పోలీసుల కంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చాలా షార్ప్ అని ఎన్నో సందర్భాలలో రుజువైంది కూడా.అంతేకాదు రోడ్లపై ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించడంలో కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందు ఉండడం మనం చూస్తూనే ఉంటాము.

 Viral Hyderabad City Police Share Interesting Video, Viral Posts, Hyderabad City-TeluguStop.com

వీటితోపాటు ప్రస్తుతం సమాజంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో, దాని నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాలపై అప్పుడప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ వారు తమదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ వారు ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ప్రజలు చాలా మంది వెంటనే రుణాలు ఇచ్చే ఇన్స్టెంట్ లోన్ యాప్స్, అవి ఇచ్చే లోన్ ఆఫర్స్ కు ఆకర్షితులై ఎలాంటి అనుమతులు లేకుండా లావాదేవీలు నిర్వహిస్తున్న కంపెనీలతో లోన్స్ తీసుకొని అనేకమంది ఇబ్బందుల పాలవుతున్నారు.

ఇలాంటి యాప్స్ కు ఏ పత్రాలు ఇవ్వకపోయినా, వాళ్ళు రుణాలు ఇవ్వడంతో చాలా మంది ఆన్లైన్ యాప్స్ లో లోన్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.అయితే వీరిని ఆసరా చేసుకుని కొందరు ఆన్లైన్ ముఠా సభ్యులు లోన్స్ వారి నుంచి ముక్కుపిండి మరీ అధిక వడ్డీ రేట్లతో డబ్బులు వసూలు చేస్తున్నారు.

అంతేకాదు ఒకవేళ వారు డబ్బు చెల్లించకపోతే వారి స్నేహితులతో అలాగే కుటుంబ సభ్యులకు వారి సమాచారాన్ని పంపుతూ వారి పరువు కూడా తీస్తున్నారు.ఈ మధ్యనే ఇటువంటి సంఘటనలు జరిగి వారి పరువు పోయిందన్న ఉద్దేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి కూడా మనకు తెలిసిందే.

ఇదే విషయాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు కాస్త చమత్కారంగా తెలుపుతూ ఆసక్తికర వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.ఇందులో ఓ కోతి ముసుగు కప్పి ఉన్న ఒక బొమ్మ దగ్గరికి వెళ్లగా అందులో ఓ పులి బొమ్మ ఉంటుంది.

దాన్ని చూడగానే కోతి భయపడిపోతుంది.ఈ వీడియోను షేర్ చేస్తూ.” అన్ని వెబ్ లింకులు ఓపెన్ చేయకండి.అందులో కొన్ని ప్రమాదకరమైనవి ఉండొచ్చు” అంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు తెలియజేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube