వారంలో రెండు సార్లు ఈ జ్యూస్ తాగితే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు!

ఆరోగ్యం స‌రిగ్గా లేకుంటే ఎంత డ‌బ్బు ఉన్నా వ్యర్థమే.అందుకే ఆరోగ్యం ప‌ట్ల ఎల్ల‌ప్పుడూ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని నిపుణులు చెబుతుంటారు.

 Wonderful Health Benefits Of Green Apple Spinach Juice , Health , Benefits Of G-TeluguStop.com

అయితే ఆరోగ్యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌భావితం చేసేది ఆహార‌మే.కాబ‌ట్టి, డైట్‌లో పోష‌కాహ‌రం ఉండేలా చూసుకోవాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను వారంలో రెండంటే రెండు సార్లు తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం హెల్త్‌కి మేలు చేసే ఆ జ్యూస్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? మ‌రియు ఏ టైమ్‌లో ఈ జ్యూస్‌ను తీసుకోవాలి.? వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో పావు స్పూన్ స‌బ్జా గింజ‌లు వేసి వాట‌ర్ పోసి ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు గ్రీన్ యాపిల్ ముక్క‌లు, ప‌ది వ‌ర‌కు పాల‌కూర ఆకులు, అర క‌ప్పు నీళ్లు పోసి బ్లెండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్‌లో ముందుగా నాన బెట్టుకున్న స‌బ్జా గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.

ఈ గ్రీన్ యాపిల్ పాల‌కూర జ్యూస్‌ను ఉద‌యం పూట సేవించాలి.ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా ఈ జ్యూస్‌ను వారంలో రెండు సార్లు తీసుకుంటే శ‌రీరంలో కొవ్వు క‌రిగి వేగంగా బ‌రువు త‌గ్గుతారు.కంటి ఆరోగ్యం అద్భుతంగా పెరుగుతుంది.

శ‌రీరం డీహైడ్రేష‌న్‌కి గురికాకుండా ఉంటుంది.

అంతే కాదు, గ్రీన్ యాపిల్ పాల‌కూర జ్యూస్‌ను సేవించ‌డం వ‌ల్ల లైంగిక స‌మ‌స్య‌లు తొల‌గి పోతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం త‌గ్గుతుంది.ఎముక‌లు, కండ‌రాలు బ‌లంగా త‌యారు అవుతాయి.

శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాలు పెరిగి ర‌క్త హీన‌త స‌మ‌స్య ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.ఇక గ‌ర్భిణీ స్త్రీల‌కు సైతం ఈ జ్యూస్ ఎంతో మంచిది.

Wonderful Health Benefits Of Green Apple Spinach Juice , Health , Benefits Of Green Apple Spinach Juice , Green Apple , Spinach , Health Tips , Good Health , Latest News , Green Apple Spinach Juice - Telugu Benefitsgreen, Green Apple, Greenapple, Tips, Latest, Spinach

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube