ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.33
సూర్యాస్తమయం: సాయంత్రం.6.25
రాహుకాలం: సా.3.00 ల4.30
అమృత ఘడియలు: సా.5.20 ల5.45
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36
మేషం:

ఈరోజు దైవ సేవా కార్యాక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు.వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:

ఈరోజు భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు.వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి.గృహమున కొందరి ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురవుతారు.
మిథునం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు.చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరచి సకాలంలో పూర్తిచేస్తారు.వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి.
వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు.కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి.
కర్కాటకం:

ఈరోజు గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి.నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
సింహం:

ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
కన్య:

ఈరోజు స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది.వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి.
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో చిన్న పాటి వివాదాలు ఉంటాయి.
తుల:

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది.ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలించవు.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది.బంధు మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
వృశ్చికం:

ఈరోజు సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది.అన్ని రంగాల వారికీ అనుకూల పరిస్థితులుంటాయి.వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.చేపట్టే పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు.
ధనుస్సు:

ఈరోజు నిరుద్యోగులకు చాలాకాలంగా వేచి చూస్తున్న అవకాశములు అందుతాయి.ఉద్యోగమున పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం:

ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి.వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి.
కుంభం:

ఈరోజు శత్రు సమస్యలు తొలగుతాయి.ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి.సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.
బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
మీనం:

ఈరోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చేవిధంగా ఉండవు.వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి.
స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నలాలో అవరోధాలు తొలగుతాయి.వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది.