తిరుమలలో ఈ రోజులలో సర్వ దర్శనం టికెట్లు రద్దు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానానికి( Tirumala Tirupati Devasthanam ) ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.అలాగే మరి కొంత మంది భక్తులు తల వెంట్రుకలను సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు.

 Sarva Darshanam Tickets Are Canceled In Tirumala These Days , Andhra Pradesh , T-TeluguStop.com

అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కిలక ప్రకటనను విడుదల చేసింది తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15 తేదీలలో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.పెరటాసి శనివారాల కారణంగా తిరుమలలో కొనసాగుతున్న రద్దీ దృష్ట్యా ఆయా తేదీల్లో సర్వ దర్శనం టోకెన్ల జారిని నిలిపి వేసినట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.

Telugu Andhra Pradesh, Devotees, Tirupati, Vijayadashami-Latest News - Telugu

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఎంతో ఘనంగా జరగనున్నాయి.చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది.ఇలా వచ్చిన సందర్భాలలో కన్యామాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం ఉండదు.అక్టోబర్ 19వ తేదీన గరుడ వాహనం, 20వ తేదీన పుష్పక విమానం, అక్టోబర్ 22వ తేదీన స్వర్ణ రథం,23వ తేదీన చక్రస్నానం జరగనున్నాయి.ఉదయం వాహన సేవ ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు రాత్రి వాహన సేవ ఏడు గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది.

Telugu Andhra Pradesh, Devotees, Tirupati, Vijayadashami-Latest News - Telugu

గరుడ వాహన సేవ ఏడు గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.తిరుపతిలోని కపిలేశ్వరాలయంలో కామేశ్వరి అమ్మవారి( Goddess Kameshwari ) శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి.ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారు.ఈ ఉత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 11న కోయిల్ ఆళ్వార్ నిర్వహిస్తారు.అక్టోబర్ 15న కలశ స్థాపన అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 16న శ్రీ కామాక్షి దేవి, 17న శ్రీ ఆదిపరాశక్తి, 18న మహాలక్ష్మి, 19వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి, 20వ తేదీన దుర్గాదేవి, 21వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని, 22వ తేదీన శ్రీ సరస్వతీదేవి( Sri Saraswati Devi ), 23వ తేదీన విజయదశమి ( Vijayadashami )సందర్భంగా శ్రీ శివపార్వతుల( Shiva Parvati ) అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube