మోహన్ బాబు( Mohan Babu ) హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.మిగతా నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు ( Manchu Vishnu )సైతం తనదైన రీతిలో సినిమాలను చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే విష్ణు సినిమాలను సక్సెస్ చేయడంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి.ఎందుకంటే ఒక సినిమాని సక్సెస్ చేయడానికి సినిమాలో చాలా వరకు ఎలిమెంట్స్ అయితే ఉండాలి.
ఆ ఎలిమెంట్స్ ఏవి అతని సినిమాల్లో మనకు కనిపించవు.అందువల్లే తన తోటి హీరోలతో సినిమాలు చేయలేక విష్ణు చేతులెత్తేసాడు.ఇక మొత్తానికైతే మోహన్ బాబు నట వారసుడి గా గుర్తింపు సంపాదించుకోవాలంటే మాత్రం ప్రస్తుతం ఆయన చేస్తున్న భక్త కన్నప్ప సినిమా ( Bhakta Kannappa movie )భారీ సక్సెస్ ని సాధిస్తే తప్ప తనకంటూ ఒక క్రేజ్ అయితే ఏర్పడదు.
మరి ఇలాంటి సందర్భంలో భక్తకన్నప్ప లాంటి సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అనే ఒక ఎలిమెంట్ తప్పితే మిగతా ఏ విషయంలో కూడా ఈ సినిమా ప్రేక్షకుల్లో బజ్ అయితే లేకుండా పోతుంది.ఇక ఈ సినిమా మీద 150 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా చాటుకుంటున్నాడు.ఇక తను ఇలాగే ఉంటే చాలా కష్టం అవుతుంది.
కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించి తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటే తప్ప లేకపోతే మాత్రం మంచు విష్ణు కెరియర్ ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే.