మొటిమలు( Pimples ) ప్రధానంగా వేధించే చర్మ సమస్యల్లో ఒకటి.అయితే కొందరికి చెంపలపై చాలా అధికంగా మొటిమలు ఏర్పడుతుంటాయి.
దీంతో తీవ్రమైన అసౌకర్యానికి, చిరాకుకు గురవుతుంటారు.వాస్తవానికి అధిక చక్కెర వినియోగం మరియు పొల్యూషన్ కారణంగా చెంపల మీద ఎక్కువగా మొటిమలు వస్తుంటాయి.
ఈ సమస్యకు చెక్ పెట్టాలి అంటే కొన్ని కొన్ని చిట్కాలను కచ్చితంగా పాటించాలి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న గ్రీన్ టీ( Green Tea ) వేసుకోవాలి.అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దూది సహాయంతో చెంపలపై ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే మొటిమలు చాలా త్వరగా మాయం అవుతాయి.వాటి తాలూకు మచ్చలు ఉన్న తగ్గుముఖం పడతాయి.

అలాగే మరొక పవర్ ఫుల్ రెమెడీ కూడా ఉంది.దానికోసం ముందుగా కొన్ని పుదీనా ఆకులు తీసుకుని మెత్తగా దంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు పుదీనా జ్యూస్, చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని చెంపలపై అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకుని కడిగేయాలి.
ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.ఇక ఈ చిట్కాలతో పాటు మీరు చక్కెరను తీసుకోవడం పక్కన పెట్టండి.
అలాగే బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ముఖానికి స్కార్ఫ్ కట్టుకోండి.నైట్ నిద్రించే ముందు తప్పకుండా ఫేస్ వాష్ చేసుకోండి.
వాటర్ ఎక్కువగా తీసుకోండి.డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోండి.
తద్వారా మొటిమలకు దూరంగా ఉండవచ్చు.







