బిస్లరీ సంస్థను అమ్ముకుందామనుకున్న ఫౌండర్.. ఆయన కూతురు రంగంలోకి దిగడంతో..?

ఈరోజుల్లో ఇండియన్ మార్కెట్‌లో కిన్లే, టాటా( Kinley, Tata ) వంటి వాటర్ బాటిల్స్ ఎన్నో అందుబాటులోకి వచ్చాయి.కానీ ఒకప్పుడు బిస్లరీ వాటర్ బాటిల్స్( Bisleri Water Bottles ) మాత్రమే అందుబాటులో ఉండేవి.

 Facts About Bisleri Company Founder , Kinley, Tata , Bisleri Water Bottles , Jay-TeluguStop.com

ఆ వాటర్ టేస్టీగా ఉండటం వల్ల దానికి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.అలాంటి మంచి వాల్యూ ఉన్న బిస్లరీ బ్రాండ్ ఒకానొక సమయంలో నష్టాల్లో కూరుకుపోయింది.

ఈ మినరల్ వాటర్ బ్రాండ్‌ను ప్రారంభించిన రమేష్ చౌహాన్ దాన్ని టాటాకు అమ్మేద్దామని భావించారు.రమేష్ కి ఒక్కగానొక్క కూతురు ఉంది.

ఆమె పేరు జయంతీ చౌహాన్( Jayanthi Chauhan ).రమేష్ తన కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటూ ఆమెను ఎప్పుడూ అడుగుతుండేవారు కానీ ఆమె పట్టించుకోలేదు.అయితే కంపెనీ నష్టాల్లో ఉందని తెలియడంతో వెంటనే ఆ సంస్థను హ్యాండ్ ఓవర్ చేసుకుంది.కష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తేవడమే కాకుండా దాన్ని అంబానీ, టాటా కంపెనీలకు పోటీగా నిలబెట్టింది.

బిస్లరీతో పాటు, సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారంలోనూ దూసుకుపోతోంది.జయంతీ చౌహాన్ సాధించిన ఈ విజయం అంత చిన్నదేం కాదు.ఇప్పుడు ఆమె వ్యాపార సామ్రాజ్యం విలువ ఏకంగా రూ.7 వేల కోట్లు.రమేష్ స్థాపించిన బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థను కాపాడగలిగే కొడుకులెవ్వరూ లేరు.ఆ సమయంలో నేనున్నా నాన్న అంటూ జయంతీ చౌహాన్ 2022, నవంబర్ నెలలో బిస్లరీ సంస్థ బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకుంది.

Telugu Bisleri Bottles, Bislericompany, Kinley, Los Angeles, Tata-Movie

జయంతి చౌహాన్ న్యూయార్క్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో పెరిగింది.తర్వాత లాస్ ఏంజిల్స్‌కు ( Los Angeles )వెళ్లి అక్కడ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ (FIDM)లో డిగ్రీ పూర్తి చేసింది.అంతేకాదు, లండన్‌కు వెళ్లి ఫ్యాషన్ స్టైలింగ్, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ వంటి విభిన్నమైన రంగాల్లో కోర్సులు పూర్తి చేసింది.ఇవన్నీ పరిశీలిస్తుంటే ఆమె అసలు బిజినెస్‌కి సంబంధించిన ఏ కోర్సు చేయలేదని తెలుస్తోంది.

ఆమె ప్యాషన్ వేరని కూడా అర్థం అవుతుంది.కానీ, తప్పని పరిస్థితుల్లో తండ్రి బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది.

మార్కెట్ సవాళ్లను అధిగమించి ఈ సంస్థను నిలబెట్టాల్సిన బాధ్యత ఆమెపై పడింది.ఈ సవాళ్లను ఆమె ఒక్కొక్కటిగా దాటుకుని చివరికి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా గొప్ప బిజినెస్ ఉమెన్ గా తయారయ్యింది.

ఆమె నేతృత్వంలో బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థ ఆదాయం శరవేగంగా పెరుగుతూ పోయింది.

Telugu Bisleri Bottles, Bislericompany, Kinley, Los Angeles, Tata-Movie

ఆమే అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ స్కిల్స్ కారణంగా పతనం అవుతున్న సంస్థ కాస్త ఇప్పుడు మోస్ట్ సక్సెస్‌ఫుల్ కంపెనీస్‌లో ఒకటిగా అవతరించింది.బిస్లరీ కూల్ డ్రింక్స్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని ఎప్పుడూ ఆలోచన చేయలేదు.మరోవైపు జయంతీ చౌహాన్ తన తండ్రి కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోక ముందే అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కాంపా కోలా బ్రాండ్‌తో కూల్ డ్రింక్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే కొద్దిగా ఆలస్యంగా ఈ సాఫ్ట్ డ్రింక్స్‌ మార్కెట్‌లో అడుగుపెట్టిన జయంతి తన వ్యాపారం నైపుణ్యాలను ప్రదర్శించింది.మీడియా, సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటూ తమ సాఫ్ట్ డ్రింక్స్ పాపులారిటీ పెంచేసింది.

జయంతీ చౌహాన్ తెలివితో ఏకంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకే ఛాలెంజ్ విసిరింది.జయంతీ చౌహాన్ బిస్లరీ ఇంటర్నేషనల్ బాధ్యతలు చేపట్టాక బిస్లరీ మినరల్ వాటర్ మాత్రమే కాకుండా ఆ సంస్థ నుంచి హిమాలయాల వేదికా నేచురల్ మినరల్ వాటర్, ఫిజీ ఫ్రూట్ డ్రింక్స్, స్పైసీ జీరా డ్రింక్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైయర్ వంటి మరెన్నో డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఇవన్నీ వినియోగదారులకు బాగా దగ్గరయ్యాయి.పురుషులే ఏదైనా సాధించగలరు అని అనుకునే ఈ సమాజంలో జయంతీ చౌహాన్ ఆ భావనలను పటాపంచలు చేసింది.ఆమె జర్నీ మహిళలందరికీ ఒక స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube