సాధారణంగా కొందరి మోచేతులు బాగా నల్లగా మరి అసహ్యంగా కనిపిస్తుంటాయి.శరీరం మొత్తం తెల్లగా ఉన్న మోచేతులు మాత్రం నల్లగా ఉంటే ఎంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు.
ఈ క్రమంలోనే మోచేతులను సైతం శరీరం రంగులోకి మార్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.మీరు కూడా ఈ జాబితాలో ఉంటే.
అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ చిట్కాను పాటిస్తే కనుక కేవలం కొద్ది రోజుల్లోనే నల్లగా మారిన మోచేతులను తెల్లగా మరియు మృదువుగా మెరిపించుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు వైట్ రైస్ ను వేసి వాటర్ పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్ లో వేసి కొద్దిగా వాటర్ పోసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత రెండు స్ట్రాబెరీ లను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను కూడా మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న రైస్ పేస్ట్ లో స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసుకుని కనీసం ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం నిమ్మ చెక్కతో స్మూత్ గా మోచేతులను స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మోచేతులను నిమ్మ చెక్కతో స్క్రబ్బింగ్ చేసుకుని.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ మ్యాజికల్ చిట్కాను రోజుకు ఒక్కసారి కనుక పాటిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే నల్లగా ఉన్న మోచేతులు తెల్లగా మరియు మృదువుగా మారతాయి.
.