బలహీనమైన జుట్టు కుదుళ్ళను బలంగా మార్చే సూపర్ పవర్ ఫుల్ రెమెడీ మీకోసం!

ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, కాలుష్యం, మద్యపానం, ధూమపానం, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారతాయి.బలహీనమైన కుదుళ్ల కారణంగా హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా తీవ్రతరంగా మారుతుంటుంది.

 A Super Powerful Remedy To Make Weak Hair Follicles Strong Is For You! Hair Foll-TeluguStop.com

ఫలితంగా ఒత్తయిన జుట్టు పలుచగా తయారవుతుంది.దీంతో ఏం చేయాలో తెలీక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే బలహీనమైన మీ కుదుళ్లు కొద్ది రోజుల్లోనే బ‌లం గా మారతాయి.

దాంతో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా మరియు పొడుగ్గా పెరగడం ప్రారంభం అవుతుంది.

మరి ఇంతకీ ఆ సూపర్ పవర్ ఫుల్ రెమెడీ ఏంటి.? అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో కడిగి పెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని వేసి కనీసం ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

అనంతరం స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తరువాత ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు కోడి గుడ్లను బ్రేక్ చేసి వేసుకోవాలి.

అలాగే అర కప్పు కొబ్బరి పాలు, అర కప్పు రైస్ వాటర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను వేసి అన్నీ కలిసేంతవరకు మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో రెండే రెండు సార్లు ఈ సూపర్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే బలహీనమైన కుదుళ్లు కొద్ది రోజుల్లోనే స్ట్రాంగ్ గా మార‌తాయి.దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది.

అదే సమయంలో కుదుళ్లు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.డ్రై హెయిర్ సమస్య నుంచి సైతం ఈ రెమెడీ ద్వారా బయటపడొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube