కురుల ఆరోగ్యానికి చింతాకు.. ఇలా వాడితే హెయిర్ ఫాల్ తో సహా ఆ సమస్యలన్నీ దూరం!

చింత చెట్టు నుంచి వచ్చే చింతపండు మాత్ర‌మే కాదు చింత ఆకు ( Tamarind leaves )కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.చాలా మంది లేత చింత ఆకుతో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.

 How To Use Tamarind Leaves For Healthy Hair! Tamarind Leaves, Tamarind Leaves Be-TeluguStop.com

రక్తహీనతను తరిమి కొట్టడంలో, రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో, క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడంలో, గుండె జ‌బ్బుల నుంచి రక్షించడంలో చింతాకు ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.అలాగే కురుల ఆరోగ్యానికి సైతం చింతాకు మద్దతు ఇస్తుంది.

Telugu Care, Care Tips, Fall, Healthy, Latest, Tamarind, Tamarind Pack-Telugu He

ముఖ్యంగా చింత ఆకును ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే హెయిర్ ఫాల్( Hair fall ) తో సహా అనేక జుట్టు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ చెంత ఆకును వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Care, Care Tips, Fall, Healthy, Latest, Tamarind, Tamarind Pack-Telugu He

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.చింత ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, ప్రోటీన్ తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.పైన చెప్పిన విధంగా చింతాకును వారానికి ఒకసారి తలకు పట్టించడం వల్ల చాలా లాభాలు పొందుతారు.ప్రధానంగా చింత ఆకు జుట్టు రాలడాన్ని అరికడుతుంది.మూలాల నుంచి కురులను బలోపేతం చేస్తుంది.చుండ్రు సమస్యకు చెక్ పెట్టి స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అలాగే చింత ఆకు కొత్త జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.జుట్టును ఒత్తుగా పొడుగ్గా మారుస్తుంది.

మరియు చింత ఆకుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు త్వరగా తెల్ల పడకుండా సైతం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube