అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మారుమోగుతోన్న మన ‘‘ నాటు నాటు ’’

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.

( RRR ) భారత స్వాతంత్య్రోద్యమం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది.

అంతేకాదు.ఇందులోని నాటు నాటు పాటకు( Naatu Naatu Song ) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్( Oscar Award ) వరించింది.

ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫిలో వచ్చిన ఈ పాటకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.అన్ని భాషలకు చెందినవారు నాటు నాటు సాంగ్‌కి డ్యాన్స్‌లు వేస్తూ దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేవారు.

"""/" / తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ నాటు నాటు సాంగ్‌‌‌‌ మారుమోగుతోంది.

నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు గాను డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్,( Kamala Harris ) రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) వ్యూహాలు రచిస్తున్నారు.

ముఖ్యంగా భారత సంతతి ఓటర్లను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.దీనిలో భాగంగానే డెమొక్రాటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన అజయ్ భూటోరియా నాటు నాటు హిందీ వెర్షన్ ‘నాచో నాచో’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో హారిస్ - వాల్జ్ ప్రచార చిత్రాలను రూపొందించారు.

"""/" / నాచో నాచో పాట ద్వారా దక్షిణాసియా కమ్యూనిటీతో అనుసంధానం కావడమే తమ లక్ష్యమని అజయ్ జైన్ పేర్కొన్నారు.

4.4 మిలియన్ల మంది భారతీయ ఓటర్లు, 6 మిలియన్ల మంది దక్షిణాసియా ఓటర్లు నవంబర్ 5న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన చెప్పారు.

2020 ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లే .ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌ను అధ్యక్షురాలిగా ఎన్నుకునే సమయం వచ్చిందని అజయ్ అన్నారు.

నవంబర్ 5 ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే.అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారు.

డ్రాగన్ సినిమాలో మాస్ జాతర జరగబోతుందా..?