తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించాడు .అయితే కొంతమంది హీరోయిన్లు వెంకటేష్ కు ఫర్ ఫెక్ట్ జోడీ అని పేరు సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే.
ఇలాంటి హీరోయిన్లలో అటు బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ కూడా ఒకరు.వెంకటేష్ సరసన మల్లీశ్వరి అనే సినిమాలో నటించింది కత్రినా కైఫ్.
ఇక చేసింది ఒక్క సినిమా అయినా వీరిద్దరి జోడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.
2003లో కె.విజయభాస్కర్ దర్శకత్వంలో మల్లీశ్వరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాకు నిర్మాణ సంస్థ గా వ్యవహరించింది.కత్రినా కైఫ్ అప్పుడప్పుడే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే సినిమా షూటింగ్ సమయంలో తెలుగు రాణి కత్రినాకైఫ్ దర్శక నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టిందట.ముందుగా కత్రినాకైఫ్ కు ఎంత పారితోషికం ఇవ్వాలి అన్న విషయం పై దర్శక నిర్మాతలు చర్చలు జరిపారు.
కానీ ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయిన తర్వాత కత్రినాకైఫ్ తనకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వాలంటూ డిమాండ్ చేసిందట.

అంతేకాదండోయ్ ఇక తనతో పాటు తన టీం కి కూడా విమాన టికెట్లను నిర్మాతలే భరించాలి అంటూ డిమాండ్లు సురేష్ బాబు ముందు పెట్టిందట కత్రినాకైఫ్.బస చేసేందుకు ఫైవ్ స్టార్ హోటల్ లో రూము కావాలని ఇలా ఎన్నో కోరికలు కోరిందట.అంతేకాదండోయ్ ఇక ఇవన్నీ ఒప్పుకుంటేనే షూటింగ్ కు వస్తానంటూ కొన్నాళ్ళపాటు బ్రేక్ కూడా తీసుకుందట.
ఇంకేముంది ఈ విషయం తెలిసి వెంకటేష్ కి చిర్రెత్తుకొచ్చింది.ఇక ఆమెపై ఎలా చర్యలు తీసుకోవాలని కూడా చర్చలు జరిపారట.
షూటింగ్ ఆపేయాలని సురేష్ బాబు కూడా అనుకున్నారట.కానీ ఇక నిర్మాత అశ్వినీదత్ సూచనమేరకు కత్రినా అడిగిన కొన్ని డిమాండ్లను తీర్చారట.
ఇక అప్పటినుంచి సురేష్బాబు హీరోయిన్లతో చేసుకునే అగ్రిమెంట్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాడు.