యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District):రామన్నపేట మండలం సిరిపురం శివారులో అక్రమంగా నిలువ చేసిన 54 క్వింటాళ్ల రేషన్ బియ్యం విజిలెన్స్ అండ్ సివిల్ సప్లై అధికారులు శుక్రవారం పట్టుకున్నారు.గ్రామ శివారులోని వ్యవసాయ భావి వద్ద 180 తెల్ల బస్తాలలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
మహేందర్ (Mahender)అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.పట్టుబడిన నిందితుడు కళ్ళుకప్పి తప్పించుకున్నాడు.
ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ దాడుల్లో విజిలెన్స్ సిఐ గౌస్,సివిల్ సప్లై డిటి బాలమని,ఇబ్బంది పాల్గొన్నారు.