టాలీవుడ్ స్టార్ హీరోలలో ఇప్పటికే చాలామంది హీరోలు భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.భారీ వర్షాలు, వరదల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
వరదల వల్ల( Floods ) ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు.నిత్యావసర వస్తువులు సైతం లేక ఆకలి బాధతో అలమటిస్తున్నారు.
నిత్యావసర వస్తువులు సైతం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు సాయం చేసే దిశగా అడుగులు వేయగా తాజాగా ఈ జాబితాలో విక్టరీ వెంకటేశ్,( Victory Venkatesh ) రానా( Rana ) చేరారు.ఈ ఇద్దరు హీరోలు ఏపీ, తెలంగాణ సీఎం నిధికి మొత్తం కోటి రూపాయలు విరాళంగా అందించారు.ఇతర హీరోలలా అటు ఏపీకి 50 లక్షల రూపాయలు, తెలంగాణకు 50 లక్షల రూపాయలు ప్రకటించి మంచి మనస్సును చాటుకున్నారు.
వెంకటేశ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
కష్ట కాలంలో ఆదుకునే మంచి మనస్సు కొంతమందికే ఉంటుందని అలాంటి మంచి మనస్సు ఉన్న వెంకీ, రానాలను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వెంకటేశ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.ఫ్యామిలీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
వెంకటేశ్ పారితోషికం ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉండగా వెంకటేశ్ భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటే మరిన్ని విజయాలు ఖాతాలో చేరతాయని చెప్పవచ్చు.వెంకటేశ్ అనిల్ కాంబో మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
వెంకటేశ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రానా రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.