కోటి రూపాయల సాయం ప్రకటించిన వెంకీ, రానా.. మంచి మనస్సున్న హీరోలంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఇప్పటికే చాలామంది హీరోలు భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

భారీ వర్షాలు, వరదల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

వరదల వల్ల( Floods ) ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు.నిత్యావసర వస్తువులు సైతం లేక ఆకలి బాధతో అలమటిస్తున్నారు.

నిత్యావసర వస్తువులు సైతం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. """/" / ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు సాయం చేసే దిశగా అడుగులు వేయగా తాజాగా ఈ జాబితాలో విక్టరీ వెంకటేశ్,( Victory Venkatesh ) రానా( Rana ) చేరారు.

ఈ ఇద్దరు హీరోలు ఏపీ, తెలంగాణ సీఎం నిధికి మొత్తం కోటి రూపాయలు విరాళంగా అందించారు.

ఇతర హీరోలలా అటు ఏపీకి 50 లక్షల రూపాయలు, తెలంగాణకు 50 లక్షల రూపాయలు ప్రకటించి మంచి మనస్సును చాటుకున్నారు.

వెంకటేశ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. """/" / కష్ట కాలంలో ఆదుకునే మంచి మనస్సు కొంతమందికే ఉంటుందని అలాంటి మంచి మనస్సు ఉన్న వెంకీ, రానాలను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వెంకటేశ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఫ్యామిలీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.వెంకటేశ్ పారితోషికం ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉండగా వెంకటేశ్ భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటే మరిన్ని విజయాలు ఖాతాలో చేరతాయని చెప్పవచ్చు.

వెంకటేశ్ అనిల్ కాంబో మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

వెంకటేశ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

రానా రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అక్కడ దేవర ఐమ్యాక్స్ వెర్షన్ కు సైతం అదిరిపోయే రెస్పాన్స్.. తారక్ రేంజ్ వేరే లెవెల్!