మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి (పొక్సో కేసులో) మూడేళ్ళ జైలు శిక్ష, 2000/- రూపాయల జరిమానా..

రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి (పొక్సో కేసులో) మూడేళ్ళ జైలు శిక్షతో పాటుగా 2000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు ) ఎన్.ప్రేమలత శుక్రవారం రోజున తీర్పు వెల్లడించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటికి దగ్గరలో నిందుతుడు చీపెల్లి మల్లయ్య నివాసముండేవాడు.25/12/ 2018 బాలిక ఒంటరిగా వుండగా మల్లయ్య ఆ బాలికకు బిస్కెట్స్ ఇస్తానని మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు.

 A Person In A Pocso Case Sentenced To Three Years Imprisonment, Pocso Case , Th-TeluguStop.com

మరుసటి రోజు బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పడంతో ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇల్లంతకుంట అప్పటి ఎస్.ఐ చంద్రశేఖర్ నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.ప్రాసిక్యూషన్ తరపున పి.పి.పెంట శ్రీనివాస్ వాదించగా,సి ఎం ఎస్ ఎస్.ఐ రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ నవీన్,సిఎంఎస్ కానిస్టేబుల్ నరేందర్ లు కోర్టులో 12 మంది సాక్షులను ప్రవేశపెట్టాగా,కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్.ప్రేమలత నిందుతుని మూడు సంవత్సరాలు జైలు శిక్ష,2000/- రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలీసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.

పైకేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ పెంట శ్రీనివాస్,,సి ఎం ఎస్ ఎస్.ఐ రవీంద్రనాయుడు, కోర్ట్ కానిస్టేబుల్ లు నవీన్, సి ఎం ఎస్ కానిస్టేబుల్ నరేందర్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube