నల్లగొండ జిల్లా:గత ఆరు నెలలుగా జీతాలు పడక అవస్థలు పడుతూ గ్రామ కార్యదర్శిని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదంటూ నల్లగొండ జిల్లా పెద్దవూర మండల( Peddavoora ) కేంద్రంలో పని చేస్తున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ( Gram Panchayat sanitation workers ) జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ కార్యదర్శి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
జీతాలు రాక కుటుంబాలు గడవక రోడ్డున పడ్డామని,పస్తులుంటూ పారిశుద్ధ్య పనులు చేస్తున్నామని వాపోయారు.
ఒక్క నెల జీతం రాకుంటేనే పెద్ద పెద్ద ఉద్యోగులు సైతం విధులు బహిష్కరిస్తారని,ఆరు నెలల నుంచి జీతాలు లేకుండా తామేలా పని చేయాలని ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్ స్పందించి తమకు పెండింగ్ లో ఉన్న ఆరు నెలల జీతాలు ఓకే సారి వచ్చేటట్లు చర్యలు తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు ఊరే వెంకటయ్య, రమేష్,ప్రభాకర్,ఊరే శంకర్, మాతంగి కాశయ్య,ఊరే అలివేలు,ఊరే సైదమ్మ,ఊరే యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.