కొండమల్లేపల్లి తహశీల్దార్ కార్యాలయం( Tahsildar office )లో ఆర్ఐగా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఓ రైతు వద్ద నుండి రూ.30 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు( ACB Officials ) రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.కేశ్యతండాకు చెందిన బానవత్ లచ్చు ఎకరం భూమి పట్టా చేయుటకు దరఖాస్తు పెట్టుకోగా సదరు ఆర్ఐ రూ.30 వేలు డిమాండ్ చేశాడని రైతు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ను సంప్రదించాడు.గత నాలుగు రోజుల నుండి రెక్కీ నిర్వహించిన ఏసీబీ గురువారం దేవరకొండలోని మీనాక్షి సెంటర్ వద్ద తన కారులో రైతు వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు.ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలుస్తుంది.
Latest Nalgonda News