నల్లగొండ జిల్లా:ఉపాధి హామీ పథకం సంబంధించిన అనేక సమస్యలపై,అనేక అంశాలపై సుదీర్ఘ కాలంగా పోరాడి సాధించిన హక్కులన్నింటినీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని,ఉపాధి కూలీలంతా గ్రామీణ ప్రాంతంలో సంఘటిత శక్తిగా మారి,హరించి వేయబడుతున్న హక్కులతో పాటు మరిన్ని హక్కులను సాధించాలని” ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి పిలుపునిచ్చారు.శుక్రవారం కట్టంగూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువు పనుల్లో నిమగ్నమైన ఉపాధి కూలీలందరినీ కలిసి వారి యొక్క సమస్యలన్నింటినీ తెలుసుకున్నారు.
వాటి పరిష్కారానికి ఉద్యమ రూపం ఇస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నమళ్ళ పృథ్వీరాజ్,పోతెపాక విజయ్,మామిడి చంద్రయ్య,అద్దంకి రామస్వామి, ఇంద్రకంటి సైదులు,అంతటి సంధ్య,మేడి రేణుక, మునుగోటి శైలజ,పేరిపాక రవి,వద్ది అండాలు, నకిరెకంటి మల్లమ్మ,కంభంపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







