ప్రముఖ ఇండియన్ డిజిటల్ పేమెంట్ సంస్థ అయినటువంటి ఫోన్‌పే తమ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.సూపర్ క్యాష్ బ్యాక్ అనే బంపర్ అఫర్ ని తీసుకొచ్చింది.
ఫోన్ పే యాప్ ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసినవారికి ఈ భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది.అయితే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు వున్నాయి.
ఈ ఆఫర్ మే 3 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఫోన్ పే సంస్థ తెలిపింది.కాబట్టి యూజర్లు సత్వరమే త్వరపడమని చెబుతోంది.
ఈ అఫర్ లో భాగంగా ఫోన్ ఫే యాప్ ద్వారా 24 క్యారెట్ల గోల్డ్, వెరైటీ డిజైన్లలో గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్ల మాదిరిగా కొనుగోలుదారులకు డెలివరీ చేయనుంది.అంతేకాకుండా, ఫోన్ పే ద్వారా గోల్డ్ కొంటే.రూ.2,500 వరకు క్యాష్ బ్యాక్ పొందే వీలుంది.అలాగే వెండి నాణేలు, బార్ లను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.250 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది.ఇక ఫోన్‌పే ద్వారా 99.99 శాతం స్వచ్ఛమైన బంగారంతో పాటు, వెండిని కూడా కస్టమర్లు సొంతం చేసుకోవచ్చునని కంపెనీ చెప్పడం గమనార్హం.

ఇకపోతే యూజర్లకు ఈ రకమైన డౌట్స్ రావచ్చు.ఫోన్ పే ద్వారా బంగారం కొనుగోలు చేస్తే దానికి విలువ ఉంటుందా? లేదా అనే అనుమానం కలగవచ్చు.అయితే ఈ విషయంలో కస్టమర్లు అస్సలు దిగులు చెందకుండా ఫోన్‌పే సంస్థ ఒక సర్టిఫికేట్ జారీ చేస్తోంది.ఫేన్ పే ప్లాట్ ఫాం నుంచి స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేసే వారికి స్వచ్ఛతకు సంబంధించి సర్టిఫికేట్ అందిస్తామని వెల్లడించింది.
ఫోన్ పే క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే మే 3వ తేదీలోగా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయొచ్చు.ఇక ఆలస్యం చేయకుండా మీరు వెంటనే ఫోన్ పే ద్వారా బంగారం, వెండిని కొనేసుకోండి.
అద్భుతమైన క్యాష్ బ్యాక్ ను సొంతం చేసుకోండి.







