సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌( Telangana Govt ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది.సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరిం చుకొని ఆరు రోజులు సెలవులు ప్రకటించింది.

 Telangana Govt Announced Sankranti Holidays, Sankranti Holidays, Telangana Govt-TeluguStop.com

జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సెలవులు ఉంటాయని వెల్లడించింది.ఈ మేరకు పాఠశాల విద్యాడైరెక్టరేట్‌ ప్రకటన విడుదల చేసింది.

మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.

జనవరి 12వ తేదీన సెలవులు ప్రారంభం కానున్నాయి.13వ తేదీన రెండో శనివారం కావడంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది.ఇక 14 ఆదివారం భోగి పండుగ వచ్చింది.15వ తేదీన సంక్రాంతి కాగా,16న కనుమ పండుగ ఉంది.ఇక 17వ తేదీన ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది.

మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. 18వ తేదీన అన్ని విద్యా సంస్థలు యథావిథిగా తెరుచుకోనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube